రాష్ట్రీయం

సెలైన్ బాటిల్‌లో పురుగులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 15: సర్కారు ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. గాంధీ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నిర్వాకం వల్ల ఓ పసి ప్రాణం ప్రమాదంలో పడింది. జనగామకు చెందిన భిక్షపతి అనారోగ్యంతో బాధపడుతున్న తన ఆరేళ్ల కూతురు సాయి ప్రవళిక (6)ను ఈ నెల 7న గాంధీ ఆసుపత్రిలో చేర్పించాడు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక కూడా ప్రవళిక మళ్లీ జ్వరంతో మంచాన పడింది. దీంతో తండ్రి భిక్షపతి కూతుర్ని తిరిగి గాంధీ ఆస్పత్రిలో చేర్పించాడు. అయితే బాలిక పరిస్థితి గురువారంనాడు ఉన్నట్టుండి విషమించింది. బాలిక శరీరం రంగు కూడా మారిపోవడంతో కుటుంబీకులు కంగారు పడ్డారు. అదే సమయంలో ప్రవళికకు ఎక్కిస్తున్న సెలైన్ బాటిల్‌లో పురుగులు ఉండటాన్ని వారు గమనించారు. సిబ్బంది చూసుకోకుండా సెలైన్ పెట్టడంతో బాలిక పరిస్థితి విషమించింది. బాలిక తల్లిదండ్రులు సిబ్బందిని నిలదీయగా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. సదరు విషయాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లేందుకు యత్నించగా, ఆయన అందుబాటులో లేరు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట అందోళనకు దిగారు. ఈ మేరకు వారు చిలకలగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
చర్యలు తీసుకుంటాం: సూపరింటెండెంట్
బాలిక ప్రవళికకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలు తీసకుంటామని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్‌రెడ్డి హామీ ఇచ్చారు. 500 ఎంఎల్ సామర్థ్యం కలిగిన సెలెన్ బాటిళ్లను సీజ్ చేసి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపిస్తామని తెలిపారు. పుణె నుంచి వచ్చిన ఓ కంపెనీకి చెందిన సెలెన్ బాటిళ్లను అన్నిటినీ సీజ్ చేయనున్నట్టు ఆయన చెప్పారు. బాలికకు మెరుగైన వైద్య సేవలందిస్తామన్నారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన అవసరం లేదన్నారు. ఇదిలావుండగా ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగిన బాలిక కుటుంబీకులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో కొద్ది సేపు ఉద్రిక్తత నెలకొంది.

బాలికకు అమర్చిన సెలైన్ బాటిల్
(ఇన్‌సెట్) ప్రవళిక ఫైల్‌ఫొటో