రాష్ట్రీయం

కడప సెంట్రల్ జైల్లో ఆగని అరాచకాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జనవరి 4: కడప సెంట్రల్ జైలులో అసాంఘిక కార్యకలాపాలు యధేచ్చగా కొనసాగుతున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. వివిధ నేరాల్లో శిక్షలుపడి జైలుశిక్ష అనుభవిస్తున్న సాధారణ ఖైదీలపై ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోయి దాడులకు దిగుతున్నారు. ఎర్రచందనం స్మగ్లర్లకు బయట నుంచి మద్యం, కావాల్సిన ఆహారం బాహటంగానే వెళుతోంది. ఆదివారం రాత్రి ఎర్రచందనం స్మగ్లర్లు సెల్ వాడుతుండగా అధికారులు, సిబ్బందికి ఎవరో సమాచారం ఇచ్చారని బాబురావు అనే జీవిత ఖైదీని ఎర్రచందనం స్మగ్లర్లు చితకబాదారు. వారంక్రితం సెంట్రల్ జైలు నుంచి నలుగురు ఖైదీలు, అంతకుముందు రిమ్స్ నుంచి ఖైదీ పారిపోయినా సెంట్రల్ జైలు అధికారులు, సిబ్బందికి చీమకుట్టినట్టు కూడా లేదు. సెంట్రల్ జైల్లో నిందితులు, జీవిత ఖైదీలకు ఒకవిధంగా ట్రీట్‌మెంట్, ఎర్రచందనం స్మగ్లర్లకు రెడ్‌కార్పెట్ ట్రీట్‌మెంట్ కొనసాగుతోంది. ఖైదీల పరారీ సందర్భంలో ఆరుగురు జైలు అధికారులపై వేటు వేసి నూతనంగా చిత్తూరు జైలుకు చెందిన లక్ష్మినరసయ్యను జైలు సూపరింటెండెంట్‌గా నియామకం చేశారు. ఎర్రచందనం స్మగర్లను చూసేందుకు వచ్చిన సందర్శకులు, కుటుంబీకులకు క్షణాల్లో ఇంటర్వ్యూలు లభించడం వారిని తనిఖీ చేయకుండా వారి సంబంధీకులు ఏమి ఇచ్చినా సిబ్బంది చేరవేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొందరు సాధారణ ఖైదీలతో జైలు అధికారులు, సిబ్బంది ఇళ్లవద్ద పనులు చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. జైలులో రోజురోజుకు అరాచకాలు పెట్రేగిపోతూ భద్రత కరువైంది. ఖైదీలకు ఆహారం పంపిణీలో కూడా నాసిరకం సరుకులు వాడుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఖైదీల పరారీతోపాటు సెంట్రల్ జైల్లో చోటుచేసుకుంటున్న వ్యవహారాలపై జైళ్ల డిజి కృష్టంరాజు సమగ్ర విచారణకు ఆదేశించారు. జైళ్ల డిఐజి జయవర్దన్‌చే విచారణ కొనసాగుతోంది. గతంలో లెక్కలేనన్ని సెల్‌ఫోన్లు, ఖాళీ మద్యం సీసాలు, తినేసి పారవేసిన బిర్యాని పాకెట్లు, గంజాయి, సిగరెట్టు ముక్కలు లభించాయి. వాటిపై కూడా ఇప్పుడు విచారణ కొనసాగుతోంది. తాజాగా ఆదివారం రాత్రి ఎర్రచందనం స్పగ్లర్లు సెల్‌ఫోన్ వాడటం, జీవిత ఖైదీలపై దాడిచేసిన సంఘటనపై జైళ్ల డిజి కృష్టంరాజుకు సమాచారం ఇవ్వడంతో ఆయన ఈవ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. తాజా ఘటనతో ఎవరిపై వేటుపడుతుందోనని పలువురు జైలు అధికారులు ఆందోళన చెందుతున్నారు.