రాష్ట్రీయం

అక్రమాల నివారణకే పెద్ద నోట్ల రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 15: పెద్ద నోట్లను ఉగ్రవాదం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, అక్రమ సంపద, నకిలీ కరెన్సీ పెరిగేందుకు ఉపయోగించడంతో కేంద్రం ఐదు వందలు, వెయ్యి రూపాయల కరెన్సీని రద్దు చేసిందని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ఆర్‌బిఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మన్‌భజన్ మిశ్రా ఈ అఫిడవిట్‌ను దాఖలు చేశారు. పెద్ద నోట్ల రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై అఫిడవిట్‌ను దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆర్‌బిఐ ఈ నిర్ణయం తీసుకుందని ఆర్‌బిఐ తెలిపింది. రద్దయిన పెద్ద నోట్లను బ్యాంకులు, పోస్ట్ఫాసుల్లో స్వీకరించేందుకు తగినంత సమయం కూడా ఆర్‌బిఐ ఇచ్చిందన్నారు. ఆర్‌బిఐ చట్టం సెక్షన్ 7 కింద కేంద్రం ఆర్‌బిఐ గవర్నర్‌ను సంప్రదించి కరెన్సీపై నిర్ణయం తీసుకోవచ్చన్నారు. ఆర్‌బిఐ బోర్డు సిఫార్సు మేరకు కేంద్రం పెద్ద నోట్ల రద్దుపై నిర్ణయం తీసుకుందన్నారు. ఆర్‌బిఐ చట్టం సెక్షన్ 26(2) కింద కరెన్సీని రద్దు చేసే అధికారం కేంద్రానికి ఉందన్నారు. అనంతరం ఈ కేసు విచారణను శుక్రవారం చేపడుతామని హైకోర్టు ప్రకటించింది.