రాష్ట్రీయం

కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.7400 కోట్ల రుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 15: కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆర్థిక సహకారం అందించడానికి బ్యాంకులు ముందుకు వచ్చాయి. ప్రాజెక్టు మొదటి దశ పనులకు రూ.7400 కోట్ల రుణాన్ని అందజేయడానికి ఇతర బ్యాంకులతో కలిసి ఆంధ్రా బ్యాంక్ కన్సార్టియంగా ముందుకు వచ్చింది. ఈమేరకు తన వాటాగా రూ.1300 కోట్లు ఇవ్వడానికి అంగీకరించింది. ప్రగతి భవన్‌లో గురువారం ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిసి ఆంధ్రా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ సురేశ్ పటేల్ తమ వాటాకు సంబంధించి చెల్లించనున్న రూ. 1300 కోట్లకు అంగీకార పత్రాన్ని అందజేశారు.
నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కె జోషి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు, ఆంధ్రాబ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎకె రథ్, డిప్యూటీ జనరల్ మేనేజర్ ప్రసాద్ ముఖ్యమంత్రితో సమావేశమై కన్సార్టియంలో బ్యాంకులవారీగా ఇవ్వనున్న రుణంపై వివరించారు. గోదావరిపై నిర్మించబోయే కాళేశ్వరం బ్యారేజి మొదటి దశ పనులకు రూ.7400 కోట్లు వ్యయం అవుతుందని కన్సార్టియం అంచన వేసింది.
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందజేస్తూ తాము భాగస్వామ్యం కావడానికి ఆసక్తిగా ఉన్నట్టు బ్యాంక్ ఎండి సురేశ్ పటేల్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మాత్రమే కాకుండా తమ బ్యాంక్ మిషన్ భగీరథ పథకానికి రూ.1935 కోట్లు, పౌర సరఫరాల సంస్థకు రూ. 1000 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు రూ. 235 కోట్లు, విత్తనాభివృద్ధి సంస్థకు రూ.400 కోట్లు రుణంగా అందించబోతుందని సురేశ్ పటేల్ ఈ సందర్భంగా వివరించారు.