రాష్ట్రీయం

టి.పవర్ డిస్కాంకు రెండు స్కోచ్ అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 15: తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి ప్రతిష్టాకరమైన స్కోచ్ అవార్డులు లభించాయి. అత్యుత్తమ విద్యుత్ విధానాలను పాటించినందుకు స్కోచ్ మెరిట్ అవార్డు, స్మార్ట్ టెక్నాలజీని అవలంభించినందుకు స్కోచ్ టెక్నాలజీ అవార్డు లభించింది. ఈ అవార్డును గురువారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో సదరన్ డిస్కాం సిఎండి రఘుమారెడ్డి స్వీకరించారు. ఈ సందర్భంగా సిఎండి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ సమృద్ధిగా లభిస్తోందని, వినియోగదారులకు కోతలు లేకుండా నిరాటంకంగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. గతంలో నేషనల్ అవార్డు, గ్రీన్ గ్రిడ్ అవార్డును కూడా పొందినట్లు ఆయన చెప్పారు.

చిత్రం..డిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో స్కోచ్ అవార్డును
స్వీకరిస్తున్న సదరన్ డిస్కాం సిఎండి రఘుమారెడ్డి