రాష్ట్రీయం

బాబువన్నీ అబద్ధాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసరావుపేట, డిసెంబర్ 16: రాష్ట్రంలో చంద్రబాబునాయుడి పాలన అబద్ధాలమయమైందని ప్రతిపక్ష నేత, వైయస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో శుక్రవారం మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి తనయుడు కాసు మహేశ్‌రెడ్డి వైయస్సార్‌సీపీ చేరుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సభకు జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ అధ్యక్షత వహించారు. చంద్రబాబు నోరుతెరిస్తే అబద్ధాలు, మోసం అని అన్నారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అడ్డగోలుగా అమ్ముతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో రైతులు, మహిళలు, విద్యార్థులు, వ్యాపారులు ఎవరూ సంతోషంగా లేరన్నారు. ఎన్నికల సమయంలో 200 హామీలను ఇచ్చిన బాబు ఇంతవరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టిన చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంపై ప్రధానిని నిలదీయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని అంటే చంద్రబాబుకు వణుకని అన్నారు. ఒకవేళ ప్రత్యేక హోదా అడిగితే ప్రధాని సిబిఐ చేత ఎక్కడ విచారణ చేయిస్తారో అని భయపడి, అడగడం లేదన్నారు. రాష్ట్రంలో అవినీతి నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా చంద్రబాబునాయుడు పాలనను బంగాళాఖాతంలో కలుపుదామని పిలుపునిచ్చారు. తెలంగాణా సిఎం ఆంధ్రా నుండి నీళ్ళు తీసుకెళ్తుంటే అడిగే ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. ఒక వేళ అడిగితే ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఆడియో, వీడియో టేపులను బయటపెట్టి, జైల్లో పెడతారని భయపడి చంద్రబాబు నీటి విషయాన్ని అడగడం లేదన్నారు.
తొలుత కాసు మహేశ్‌రెడ్డికి పార్టీ కండువాను కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సభలో ఎమ్మెల్యేలు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ముస్త్ఫా, కోన రఘుపతి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రులు మోపిదేవి వెంకటరమణ, కావటి మనోహర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.