రాష్ట్రీయం

వ్యక్తులను వేధించే లైసెన్స్ ఎవరిచ్చారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 16: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో పరిశోధన విద్యార్ధి రోహిత్ వేముల ఆత్మహత్యపై జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ శుక్రవారం నాడు స్పందించారు. దేశంలో కీలకమైన ఐదు అంశాలపై తాను మాట్లాడతానంటూ ట్విట్టర్లో చాలా రోజులుగా చెబుతున్న పవన్‌కళ్యాణ్ తొలి రోజు గోవ ధ గురించి అనేక ప్రశ్నలు సంధించారు. రెండో రోజు రోహిత్ వేముల ఆత్మహత్యపై ట్విట్టర్లో తన అభిప్రాయాలు పేర్కొన్నారు. లక్షలాది ఇతర భారతీయులు మాదిరిగానే భారతీ య జనతా పార్టీని రోహిత్ వేముల వ్యతిరేకించారని, అంతమాత్రాన ఆ పార్టీ అతడిని వేధించాలా అని నిలదీశారు. ఓ పార్టీ సిద్ధాంతాలతో ఏకీభవించనంత మాత్రాన వ్యక్తులను వేధించే లైసెన్స్ వారికి ఎవరిచ్చారని నిలదీశారు. ఇది బిజెపికి మాత్రమే కాదని, ఏ పార్టీకైనా వర్తిస్తుందని అన్నారు. ఒక వేళ ఆయన ఆ పరిస్థితుల్లో తొందరపడి కాషారుూకరణ గురించి విశ్వవిద్యాలయంలో తన వ్యతిరేక వర్గంతో ఏమైనా అంటే కేంద్రం దాన్ని విద్యార్థుల దృక్పథాల మధ్య భేదంగానే చూడాలని, కానీ కేంద్రం ఈ విషయాన్ని ఎందుకు వ్యక్తిగతంగా తీసుకుందో కారణం తెలియడం లేదని అన్నారు. దాంతో రోహిత్ వేములకు క్యాంపస్ నుండి సస్పెన్షన్‌తో పాటు వెలివేత శిక్ష పడిందని, అదే అతడి ఆత్మహత్యకు పురిగొల్పిందని పవన్ పేర్కొన్నారు. సమాజంలో సమానత్వానికి తావులేదని తెలియడం వల్ల అతనికి కోపం, నిరాశ కలిగి ఉంటాయని, మానవీ య దృక్పథంతో కౌనె్సలింగ్ లభించి ఉంటే ఒక తెలివైన విద్యార్థి ప్రాణాలు కాపాడుకునే వాళ్లమని పేర్కొన్నారు. రోహిత్ వేముల ఆత్మహత్యలో అత్యం త విచారకరమైన అంశమని, బిజెపి సహా కొన్ని పార్టీలు దానిని రాజకీయం చేశాయని, వారంతా తమకు అనుకూలంగా దానిని మలచుకుంటే బిజెపి మాత్రం రోహిత్ దళితుడు కాదని నిరూపించడంలో నిమగ్నమయిందని పేర్కొన్నారు. భవిష్యత్‌లో యువత ఇలా నిరాశ నిస్పృహలతో ప్రాణాలు తీసుకోకుండా చూడాలంటే ఏం చేయాలనే విషయాన్ని వారు విస్మరించారని అన్నారు.