రాష్ట్రీయం

అందరి ఆమోదంతోనే యాదాద్రి ప్రాజెక్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 16: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యాదాద్రి పవర్ ప్రాజెక్టుకు భూసేకరణ అందరి ఆమోదంతోనే చేపట్టామని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. శుక్రవారం శాసన మండలిలో విద్యుత్ శాఖకు సంబంధించి పలువురు కాంగ్రెస్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెబుతూ ప్రాజెక్టులన్నీ పారదర్శకతతో ప్రభుత్వ సంస్థలకే ఇచ్చామన్నారు.
ఇక విద్యుత్ ఛార్జీల నియంత్రణ ఈఆర్‌సిదేనని మంత్రి స్పష్టం చేవారు. మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలోని దామరచర్ల మండల పరిధిలో నిర్మించనున్న యాదాద్రి పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి సేకరించిన భూమిలో అక్కడి రైతులు ఆందోళన చెందుతున్నారంటూ కాంగ్రెస్ సభ్యుడు రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని మంత్రి వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా నిర్వాసితుడేనని నిర్వాసితుల బాధలు ఆయనకు బాగా తెలుసునని, అందుకే భూసేకరణ ప్రక్రియలో పట్టాల సమస్య తలెత్తినా, వాటిని అధిగమించి రైతులందరికీ ప్రయోజనం కలిగేలా చేశారన్నారు.