రాష్ట్రీయం

మీ నగలకు నాదీ పూచీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 17: పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజల వద్ద ఉండే బంగారంపై ప్రధాని దాడి చేయబోతున్నారన్న పుకార్లను తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కొట్టిపారేశారు. నోట్ల రద్దు అంశంపై శనివారం శాసన మండలిలో జరిగిన చర్చకు సమాధానమిస్తూ సామాన్య మహిళల జోలికి వచ్చే ఆలోచన కేంద్రానికి లేదన్నారు. ఒకవేళ అలా జరిగినా, కొద్ది మొత్తంలోవుండే బంగారు నగలపై ఆంక్షలు విధించినా, స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించినా తెలంగాణ ఉద్యమ తరహాలో మరో ఉద్యమాన్ని లేవనెత్తుతానని ప్రకటించారు. పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళలు ఎవరూ గాబరాపడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. తాను ప్రధాని నరేంద్రమోదీతో మాట్లాడానని తెలియచేస్తూ, పేదలు, మధ్యతరగతి ప్రజల జోలికి రావొద్దని కోరానన్నారు. తన (కెసిఆర్) వద్ద ఎంత బంగారం ఉందో చెప్పమని ప్రధాని కోరారని అంటూ, తనకు మూడు ఉంగరాలు, ఒక గొలుసు, తన భార్యవద్ద దాదాపు 60 తులాల బంగారు ఆభరణాలు, తన కోడలి వద్దా అంతే మొత్తంలో బంగారు ఆభరణాలు ఉంటాయని, మొత్తంగా కుటుంబ సభ్యుల వద్ద 115 తులాల వరకు బంగారు ఆభరణాలు ఉంటాయని వివరించానన్నారు. 1985లోనే శాసనసభకు ఈ వివరాలు అందచేశానని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మహిళల వద్ద కొద్దిపాటి బంగారు ఆభరణాలు ఉంటాయని, వంశపారంపర్యంగా బంగారు ఆభరణాలు మహిళలకు అందుతుంటాయని, ఇది సాంప్రదాయంగా వస్తోందని గుర్తు చేశారు. అందువల్ల సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలపై ఎలాంటి ప్రభావం ఉండబోదన్నారు. అక్రమంగా బంగారం పెద్దఎత్తున నిలువ చేసిన వారిపైనే ప్రభుత్వం గురి ఉంటుందన్నారు. బంగారు కడ్డీలు, బంగారు బిస్కట్లు తదితర రూపాల్లో నల్లధనం పేరుకుపోయిన చోట్ల మాత్రం దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. 500, వెయ్యి నోట్లు రద్దు తర్వాత చాలా ప్రాంతాల్లో పెద్దఎత్తున నగదు నిలువలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని గుర్తు చేశారు. నదుల్లో భారీమొత్తంలో నోట్ల కట్టలు వేశారని, తగులబెట్టారని వచ్చిన వార్తలను ఆయన గుర్తు చేశారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత బంగారంపై ఆంక్షలు విధిస్తారని, బ్యాంక్ లాకర్లను స్వాధీనం చేసుకుంటారంటూ వార్తలు వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. నోట్ల రద్దు తర్వాతి రోజే బంగారు దుకాణాల్లో పెద్దఎత్తున కొనుగోలు జరిగాయని, ఈ లెక్కలన్నీ ప్రభుత్వం తీస్తోందన్నారు. పెద్దఎత్తున బంగారు నిల్వలు ఉన్నవారే భయపడాలని, మధ్యతరగతి, పేద కుటుంబాలు ఆందోళనకు గురికావాల్సిన ప్రమాదం లేదని విజ్ఞప్తి చేశారు.