రాష్ట్రీయం

మోదీ జపం ఆశ్చర్యకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 17: రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు బిజెపి సిఎంలాగా వ్యవహరిస్తూ అసెంబ్లీలో పెద్ద నోట్ల రద్దును సమర్థించడం ఆశ్చర్యకరంగా ఉందని టిపిసిసి అధికార ప్రతినిధి మల్లు రవి అన్నారు. శనివారం ఇక్కడ ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ సామాన్యుల కష్టాల గురించి కెసిఆర్ మాట్లాడకపోవడం దారుణమన్నారు. కెసిఆర్ ప్రతి రోజూ ప్రధాని మోదీ జపం చేస్తున్నారన్నారు.
కెసిఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా కంటే మోదీ బ్రాండ్ అంబాసిడర్‌గా మారారన్నారు. కెసిఆర్ బిజెపితో కలిసి పోయినట్లు కనపడుతోందన్నారు. ఆరోగ్యశ్రీపై అసెంబ్లీలో ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెబుతున్నట్లుగా ఉందన్నారు.