రాష్ట్రీయం

ఖమ్మంలో రూ.17లక్షల కొత్తనోట్లు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, డిసెంబర్ 18: ఖమ్మం రైల్వేస్టేషన్‌లో అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తుల నుంచి 17.24లక్షల రూపాయలను ఆదివారం రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భరత్‌పూర్ నుంచి ఖమ్మం వచ్చినట్లు చెబుతున్న వారు ఖమ్మం రైల్వేస్టేషన్‌లోకోణార్క్ రైల్‌నుంచి దిగారు. వారి వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉండటంతో రైల్వే పోలీసులు పట్టుకొని సమాచారం సేకరించారు. వారిద్దరిని ఉపేందర్, మురళీకృష్ణగా గుర్తించి వారి వద్ద నుంచి 17.24 లక్షల రూపాయల కొత్త రెండు వేల రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా మిర్చి వ్యాపారం నిమిత్తం ఈ డబ్బులను తీసుకువచ్చినట్లు వారు చెబుతున్నా పొంతన లేని సమాధానాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. మరోవైపు వీరిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే సమాచారంతో కొంతమంది మిర్చి వ్యాపారులు రైల్వేస్టేషన్ వద్దకు వచ్చి వారిని విడిపించే ప్రయత్నం చేయడం, ఇందుకోసం రాజకీయపరమైన ఒత్తిళ్ళు కూడా తీసుకువచ్చినట్లు తెలిసింది. అయితే పోలీసులు మాత్రం నిందితులను కోర్టుకు హాజరు పర్చనున్నట్లు తెలిపారు.