రాష్ట్రీయం

జలవనరులే సిరులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 4: కాల్వలు సమృద్ధిగావున్న ఆంధ్ర రాజధాని అమరావతి, విజయవాడ, తెనాలి ప్రాంతాలను ప్రపంచంలోనే నెంబర్‌వన్‌గా తీర్దిదిద్దే అవకాశం ఉందని సిఎం చంద్రబాబు అన్నారు. 3వ విడత జన్మభూమిలో భాగంగా సోమవారం తెనాలి గ్రామసభలో మాట్లాడారు. దుబాయ్, సింగపూర్ దేశాల్లో సముద్రాన్ని పూడ్చి నగరాలు నిర్మించారని, అయితే ఆంధ్ర రాజధాని అమరావతికి మంచినీటి కాలువలు చుట్టూ ఉన్నందున అద్భుత రాజధాని నిర్మించవచ్చన్నారు. వచ్చే రోజుల్లో రాష్ట్రంలోని నదులను అనుసంధానించి అభివృద్ధికి బాటలు వేస్తామన్నారు. ఆరు మాసాల్లో కృష్ణా- గోదావరిని అనుసంధానించామని, వచ్చే సీజన్‌లో సకాలంలో పంటలువేసే అవకాశం ఉంటుందన్నారు. పోలవరం తొలిదశ నిర్మాణాన్ని 2018నాటికి పూర్తి చేస్తామన్నారు. కేంద్రం తొలి కేబినెట్ సమావేశంలో తెలంగాణకు చెందిన 7 మండలాలను ఆర్డినెన్స్ ద్వారా ఏపిలోకి తేవటం వల్ల పోలవరం సాధ్యమైందన్నారు. ప్రపంచంలో ఏ దేశానికీ లేని నీరు, భూగర్భ ఖనిజ సంపద, పనిచేసే యువత మనదేశంలో ఉన్నందున భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించే శక్తి లభిస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రయివేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి సాధిస్తామన్నారు. విశాఖ కార్పొరేషన్‌లో అన్ని విద్యుత్ దీపాలను ఎల్‌ఇడి లైట్లుగా మార్చటంవల్ల విద్యుత్ పొదుపు, కార్పొరేషన్‌కు ఆదాయం కలిగిందని వివరించారు. ప్రైవేటు కంపెనీ ప్రతినిధులతో ఎల్‌ఇడి బల్బులు ఉచితంగా కార్పొరేషన్‌లో అమర్చితే పొదుపు అయ్యే విద్యుత్‌లో సగం ఆదాయం సంబంధిత కంపెనీకి, సగం ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి చేకూరుతుందని చెప్పటం వల్ల ఆ విధానం అమల్లోకి వచ్చిందన్నారు. ప్రస్తుతం ఈ ప్రయోగం దేశంలోని అన్ని రాష్ట్రాల వారు మన రాష్ట్రం వైపు చూసేలా అమలు చేశామన్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో ల్యాబ్‌లను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించి అన్ని పరీక్షలు ఉచితంగా చేసేలా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే రాయితీలవల్ల పెద్దగా ఉపయోగం లేదని, నైపుణ్య శిక్షణవల్ల అందరి జీవితాలు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తాయన్నారు. కాల్‌మనీ వ్యవహారం బయటకు రాగానే వెంటనే స్పందించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. రౌడీలు, నేరగాళ్లు వడ్డీ వ్యాపారం పేరిట పేదలను బెదిరించాలని చూస్తే, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఖబడ్దార్.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో 500 కోట్ల రూపాయల విలువైన పనిముట్లు ఉంటే, 200 కోట్ల విలువైనవి మూలపడి ఉండటం ఆందోళనకరమన్నారు. అందువల్ల పరిశుభ్రత, బయో మెడిసిన్, తోటలు, ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేందుకు ఏజెన్సీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆసుపత్రుల్లో చెదలు, ఎలుకలు, పాములు రాకుండా నివారించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేపడతామన్నారు. వైద్యులు సెలవుల పేరుతో 5 నుంచి ఆరేళ్లు పనిచేయకుండా జీతాలు తీసుకుంటున్నారని, అలాంటివారు రాజనామా చేయాలని, లేనిపక్షంలో తొలగిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలోని 90శాతం ఇళ్లలో టీవీలు ఉన్నాయని, సెల్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. వాటిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఇంటికీ 100 నుండి 150 రూపాయల ఖర్చుతో ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో భూగర్భ విధానం ద్వారా ఫైబర్ కేబుల్ వేయాలంటే 5వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్నారు. అయితే విద్యుత్ స్తంభాలకు కేబుల్‌ను ఏర్పాటు చేయటం వల్ల కేవలం రూ.320 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. తెనాలిలో మూడు కాలువలు 12 కిలోమీటర్ల మేర ఉన్నందున సుందరీకరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు తెలిపారు. ముగురునీటిని శుభ్రపరిచేందుకు అవసరమైన విధానాలకు రూ.160 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. తెనాలి-నందివెలుగు రహదారి నిర్మాణానికి 40కోట్లు ఖర్చవుతుందని, రానున్న సంవత్సరంలోగా పూర్తిచేస్తామన్నారు. తెనాలిలో సుమారు 2వేల గృహాల నిర్మాణానికి శ్రీకారం చుడతామని, కాలువల ఒడ్డున నిర్మించుకున్న ఇళ్లను తొలగించేందుకు ప్రజలు సహకరించాలన్నారు. తెనాలిలో అత్యధికులు విదేశాల్లో ఉన్నందున వారంతా సహకరిస్తే ప్రభుత్వం పైసా వెచ్చించకుండానే అభివృద్ధి జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు.

చిత్రం... జన్మభూమి గ్రామసభలో మహిళకు వంటగ్యాస్ కనెక్షన్ అందిస్తున్న సిఎం చంద్రబాబు