రాష్ట్రీయం

ఇబ్బందులున్నాయి.. ఓర్చుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 18: అట్టడుగున ఉన్నవారికి ఫలితాలు అందేలా దేశ భవిష్యత్తు కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పెద్దనోట్లను రద్దు చేయడం జరిగిందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. కాన్సర్ నయం కావడానికి కీమోథెరపీ ఏ విధంగా అవసరమో, అదేవిధంగా అవినీతి, నల్లధన నిర్మూలనకు కూడా కీమోథెరపీ అవసరమని, ఈ ప్రక్రియలో కొన్ని ఇబ్బందులు సహజమని, మన భావితరాల బంగారు భవిష్యత్తు కోసం ఈ ఇబ్బందులు ఓర్చుకోక తప్పదన్నారు. నల్లధనం, అవినీతి ఈ రెండూ సమాంతరంగా దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తున్నాయని, దేశ ప్రజలందరూ ఇలాంటి సమయంలో అభివృద్ధిలో, దేశ ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం కావాలని కోరారు. ఉంగుటూరు మండలంలోని స్వర్ణ్భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిన్నపిల్లల గుండె జబ్బులకు సంబంధించి శిబిరం ఏర్పాటుకు వచ్చిన వెంకయ్యనాయుడు ఆదివారం మీడియాతో మాట్లాడారు. దేశంలో చాలా ఏళ్లుగా సమాంతర ఆర్థిక వ్యవస్థ నడుస్తోందని, బ్యాంకింగ్ సీక్రసీ గురించి ప్రతిపక్షాలు తెలుసుకోవాలని ఆయన చెప్పారు. ప్రభుత్వం అవినీతిని అంతం చేస్తామని అంటే, ప్రతిపక్షాలు వద్దని చెప్పడం ఇప్పుడే చూస్తున్నానని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ హయాం కుంభకోణాలమయమని, యుపిఎ పరిపాలనలో జరిగిన 2జీ, 3జీ, బొగ్గు, కుంభకోణాల సంగతి అందరికీ తెలిసిందేనన్నారు. నల్లధన కుబేరులపైనా, ఉగ్రవాదులు, అవినీతిపరులే లక్ష్యంగా తమ ప్రభుత్వం పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకుందని ఆయన వివరించారు. పార్లమెంట్‌లో ఈ అంశంపై చర్చకు విపక్షాలు సహకరించి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో నవంబర్ 8న రాత్రి రూ.1000 కోట్ల మేర బంగారం వ్యాపారం జరిగిందన్నారు. దేశంలో అత్యధిక మంది నీతిమంతులున్నారని.. అవినీతిపరులున్నది కొద్దిమంది మాత్రమేనన్నారు.