రాష్ట్రీయం

బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 18: ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ (ఎబిసి)ని మరింత సమర్థవంతంగా నడిపించేందుకు ప్రముఖులు సహకారం అందించాలని ఎబిసి చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు కోరారు. ఎబిసి ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌లోని మేరీగోల్డ్ హోటల్‌లో ఆదివారం వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ, ఎపి బ్రాహ్మణ కార్పొరేషన్ పారదర్శకంగా పనిచేస్తోందన్నారు. ఈ సంస్థను మరింత బలోపేతం చేసేందుకు బ్రాహ్మణ సమాజానికి సేవలు అందించేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపు ఇచ్చారు.
ఎబిసి ద్వారా గత సంవత్సరం 11,107 మందికి 31 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం అందించామని ఎబిసి మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్ చెంగవెల్లి ఈ సందర్భంగా తెలిపారు. 2016-17 సంవత్సరంలో ఇప్పటి వరకు 22 వేల మంది 42 కోట్ల రూపాయలు అందించామని, ఈ సంవత్సరం పూర్తయ్యే సరికి మొత్తం 40 వేల మందికి 70 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. విద్యార్థులతో పాటు యువతకు స్కిల్ బిల్డింగ్‌లో శిక్షణ ఇస్తున్నామని, చిన్న చిన్న వ్యాపారాలు, పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన వారికి 13-14 కోట్ల రూపాయలు ఇస్తున్నామన్నారు. అలాగే 60 సంవత్సరాలపైబడ్డ వారికి గరుడ పథకం కింద నెలకు వెయ్యిరూపాయలు చెల్లిస్తున్నామని వెంకట్ వివరించారు.
బ్రాహ్మణుల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు, సమాజానికి మార్గనిర్దేశనం చేసేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నామని వెంకట్ తెలిపారు. కార్పొరేషన్‌కు ప్రభుత్వం ఇస్తున్న నిధుల్లో సిబ్బందికి వీలైనంత తక్కువ ఖర్చు జరిగేలా చూస్తున్నామని, మొత్తం నిధుల్లో ఇది ఐదు శాతం మించకుండా చూస్తున్నామని స్పష్టం చేశారు. కార్పొరేషన్ మొత్తాన్ని డిజిటలైజ్ చేశామని, అవినీతి ఏ రూపంలో ఏ స్థాయిలో లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రతి జిల్లాలో ఐదారు సమావేశాలు నిర్వహించి, సమస్యలపై అధ్యయనం చేస్తున్నామని, కార్పోరేషన్ కార్యక్రమాల గురించి వివరిస్తున్నామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సహకార పరపతి సొసైటీ (ఎబిసిసిసి) ద్వారా 60 మందికి 20కోట్ల రూపాయల సాయం చేసినట్టు వివరించారు. ఎబిసిసిసి పనితీరు పట్ల ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా, ఈ సొసైటీ అన్ని సొసైటీలకు ఆదర్శంగా ఉంటోందన్నారని గుర్తు చేశారు.
ఈ సందర్భంగా ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలాచారి ముఖ్య అతిథిగా పాల్గొనగా, అఖిల భారత సివిల్ సర్వీస్ అధికారులు, రిటైర్డ్ అధికారులు, లాయర్లు, ఆర్థిక నిపుణులు, ఐటి నిపుణులు, కార్పోరేట్ ఎగ్జిక్యూటివ్‌లు, మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.