రాష్ట్రీయం

నేత్రపర్వంగా బాలోత్సవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, డిసెంబర్ 18: బాలల సంబురం భద్రాద్రి బాలోత్సవ్ ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని బంగారు తెలంగాణ తల్లి ప్రాంగణంలో నేత్రపర్వంగా ప్రారంభమైంది. జాతీయస్థాయి ఈ బాలోత్సవానికి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన చిన్నారులు తమ తమ ప్రతిభ విశేషంగా ప్రదర్శించారు. తానా, తాళ్లూరి పంచాక్షరయ్య ట్రస్ట్, ఐటిసి పిఎస్‌పిడి, ఆటా, తెలంగాణ సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో మొదలైన ఈ జాతీయ స్థాయి బాలోత్సవాన్ని స్థానిక ఎమ్మెల్యే సున్నం రాజయ్య, తాళ్లూరి పంచాక్షరయ్య ట్రస్టు కన్వీనర్ తాళ్లూరి పంచాక్షరయ్య, ప్రవాసాంధ్రులు తాళ్లూరి జయశేఖర్, రాజశ్రీకృష్ణ, బూసిరెడ్డి శంకర్‌రెడ్డి, చావా లక్ష్మీనారాయణ, మాగంటి సూర్యం, ఏగి సూర్యనారాయణ, శ్రీపూజ, శ్రీప్రియ తదితరులు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి భారీగా బాలబాలికలు వచ్చి తమ ప్రతిభను ప్రదర్శించారు. కూచిపూడి, భరతనాట్యం, పేరిణి, చిత్రలేఖనం, వ్యాసరచన, మిమిక్రీ తదితర అంశాలలో పోటీలు జరిగాయి. వేషధారణలతో చిన్నారుల ప్రపంచం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సున్నం రాజయ్య మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని పేర్కొన్నారు. ఉన్నతంగా రాణించి దేశ భవిష్యత్‌కు బాటలు వేయాలని ఆకాంక్షించారు.

చిత్రం..నృత్య ప్రదర్శనతో అలరిస్తున్న పశ్చిమ బెంగాల్ చిన్నారులు