రాష్ట్రీయం

‘గండికోట’ నిర్వాసితులకు 479 కోట్లతో ప్యాకేజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 19: కడప జిల్లా గండికోట రిజర్వాయరు నిర్వాసితులకు 479 కోట్ల రూపాయలతో ప్యాకేజీ అందచేయనున్నట్లు జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. సంక్రాంతికి ముందే పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కడపలోని కొన్ని ప్రాంతాలకు కృష్టా జలాల్ని అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 29న పురుషోత్తంపురం, జనవరి 2న మచ్చుమర్రి ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. గండికోట రిజర్వాయరు నిర్వాసితుల సమస్యపై మంత్రి దేవనేని ఉమ, ఎమ్మెల్యే ఆదినారాయణ, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్‌కుమార్‌రెడ్డి, ఎంపి సిఎం రమేష్ తదితరులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలగపూడిలోని సచివాలయంలో సోమవారం సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం వివరాలను మంత్రి దేవినేని మీడియాకు వివరించారు. చాలాకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను చంద్రబాబు సానుకూలంగా పరిష్కరించారని మంత్రి ఉమ తెలిపారు. కాంగ్రెస్ హయాంలో కేవలం 1.85 లక్షల రూపాయలను నిర్వాసితులకు ప్యాకేజీ కింద ఇచ్చేందుకు ప్రతిపాదించగా, తమ ప్రభుత్వం దాన్ని 6.75 లక్షల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుందన్నారు. కటాఫ్ డేట్‌గా ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీని నిర్ణయించామని తెలిపారు. 9096 మంది నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించనున్నామన్నారు. ఈ రిజర్వాయరు ద్వారా కడప జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. గతంలో కొందరు ఎగతాళి చేశారని, కానీ దాన్ని తాము నిజం చేస్తున్నామన్నారు. కడప జిల్లావాసులకు సంక్రాంతి ఈసారి ముందే వస్తుందని మంత్రి వ్యాఖ్యానించారు. రెండు వారాల్లోగా ట్రయల్ రన్ పూర్తిచేసి ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. ముంపు గ్రామాల ప్రజలకు దశలవారీగా పరిహారం చెల్లించేందుకు నిర్ణయించామని, వచ్చే జూన్ నాటికి చెల్లింపులు పూర్తవుతాయన్నారు.
ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి పథకాలకు ప్రతిపక్ష నేత జగన్ సైంధవుడిలా అడ్డుపడుతున్నారని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. గండికోట రిజర్వాయరు నుంచి పులివెందుల, తదితర ప్రాంతాలకు నీరు తరలింపు జరిగేవరకూ గడ్డం తీయనని శపథం చేశానని గుర్తుచేశారు. రిజర్వాయరు పనులు కొలిక్కి వచ్చేవరకూ తాను నిరంతరం శ్రమించానన్నారు.