రాష్ట్రీయం

పచ్చ చొక్కాతోనే గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 20: ‘పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండాను భుజాన వేసుకుని పనిచేసిన కార్యకర్తలను మరువద్దు. నేను, మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నామంటే అది వారి కష్టం, త్యాగ ఫలితమే. అధికారంలో ఉన్న వాళ్లు వారిని విస్మరిస్తే పార్టీకే నష్టమ’ని ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. పసుపు చొక్కా నాకు ఒక గుర్తింపును ఇచ్చింది. రాష్ట్రానికి సేవచేసే అవకాశం కల్పించిందన్నారు. మంగళవారం విజయవాడలో జరిగిన పార్టీ ప్రజాప్రతినిధుల కార్యగోష్టిలో ఆయన కార్యకర్తలను విస్మరిస్తున్న నేతలపై చురకలు వేశారు.
గతంలో మహానాడు సందర్భంగా గోషామహల్ నుంచి మార్చ్‌పాస్ట్ రోజులను ప్రస్తావించారు. ఎంత సీనియర్లు అయినా క్రమశిక్షణ గల సైనికుల్లా వ్యవహరించడం పార్టీ ప్రత్యేకత అన్నారు. అప్పట్లో తెల్ల చొక్కాతో ఎవరైనా మహానాడుకు వస్తే చొక్కాను పసుపురంగులో ముంచి పసుపుగా మార్చిన స్ఫూర్తిని గుర్తు తెచ్చుకోవాలన్నారు. ‘రాజకీయ పార్టీలకు ఐదేళ్లకోసారి పరీక్ష, విద్యార్థులకు ఏడాదికోసారి పరీక్ష, నాకు మాత్రం ప్రతి మూడు నెలలకు ఒకసారి పరీక్ష’ అన్నారు. ప్రతి 3 నెలలకు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లు, పార్టీ వర్క్‌షాపులు నిర్వహిస్తున్నామని ఎప్పటికప్పుడు దీర్ఘకాలిక, స్వల్పకాలిక లక్ష్యాలను నిర్ణయించుకుని వాటిని సాధించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామన్నారు. మనం చేసిన పనిని ఎప్పటికప్పుడు కొలమానం చేసుకోవాలన్నారు. ఏం సాధించాలని అనుకున్నాం? ఏం సాధించాం? అనేది ప్రతి 3 నెలలకు సమీక్ష చేసుకోవాలన్నారు.
అసంఖ్యాక సభ్యత్వమే పార్టీ బలమని బాబు చెప్పారు. పార్టీ బలం సంస్థగత బలం అంటూ దేశంలో మరే పార్టీకి ఇంత సభ్యత్వ బలం లేదన్నారు. 62 లక్షల సభ్యత్వం నమోదు చేయడం గర్వంగా ఉందన్నారు. ‘ఈరోజు నేను, మీరు ఇక్కడ ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కార్యకర్తల చలవ, వారి త్యాగాలే కారణం. నక్సల్స్ చంపినా పార్టీ జెండా మోశారు. ఫ్యాక్షనిస్టులు చంపినా పార్టీని మోశారు. ఆస్తులు అమ్ముకుని, కుటుంబాలను వదిలేసి పార్టీ కోసం రాత్రింబవళ్లు పనిచేసిన కార్యకర్తల త్యాగాలు మరువలేనివి’ అంటూ కార్యకర్తల శ్రమను శ్లాఘించారు.
కార్యకర్తల రుణం తీర్చుకునేందుకే తెలుగుదేశం పార్టీ నవసూత్రాలను రూపొందించి అమలు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. కార్యకర్తల పిల్లల చదువు, ఉపాధి, వైద్యసాయం, రూ.2 లక్షల జీవిత బీమా.. అనేకం కార్యకర్తల సంక్షేమం కోసం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం నెలకు కనీసం రూ.10వేలు ఆదాయం పొందేలా చేయడమే తన లక్ష్యమన్నారు. రెండున్నరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతిని వివరించారు. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 12.23శాతం వృద్ధిరేటు సాధించామని, జాతీయ వృద్ధిరేటు కన్నా 5 శాతం అధికంగా పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో గత ఏడాది రెండో స్థానం సాధించగా, ఈ ఏడాది నెంబర్ వన్ స్థానం సాధించిన విషయం గుర్తుచేశారు. 16వేల కోట్ల లోటులో కూడా రైతులకు రూ.24వేల కోట్ల రుణ ఉపశమనం కల్పించిన ఘనత ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అక్రమాలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా ప్రతి ఏటా రూ.5,600 కోట్ల పింఛన్లు అందిస్తున్నామన్నారు.
డిమానిటైజేషన్ పరిష్కారం రాష్టస్థ్రాయిలో లేదంటూ, జాతీయస్థాయి సమస్య అని, పరిష్కారం కూడా జాతీయస్థాయిలోనే జరగాలన్నారు. పెద్దనోట్ల రద్దు వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అయినా మార్పు వస్తుందనే ఆశతో సహనంగా భరిస్తున్నారని చెప్పారు. హుద్ హుద్ తుపాన్‌ను 8 రోజుల్లో ఎదుర్కొన్నామని, ఆగస్టు సంక్షోభం నెలరోజుల్లో పరిష్కరించామని, కానీ డిజిటలైజేషన్ సమస్య పరిష్కారం మాత్రం క్లిష్టంగా మారిందన్నారు.
‘నేను, మీరు ఒక టీముగా పనిచేయాలి. మార్పు కోసం అందరూ సహకరించాలి. పదిమందిని సమన్వయం చేసుకుంటేనే నాయకుడు అవుతాడు. పదిమందితో చేసేదే రాజకీయం. పార్టీ పట్ల ప్రతి ఒక్కరికీ బాధ్యత వుంది. ప్రతి ఒక్కరికీ శ్రద్ధ ఉండాలి. ప్రజల విశ్వాసం పొందాలి. 80 శాతం ప్రజల్లో సంతృప్తి మన లక్ష్యం కావాలి’ అని లక్ష్య నిర్దేశం చేశారు.
వ్యక్తిగతంగా తనపైన, తెలుగుదేశం పార్టీపైన ఒక వ్యక్తి చేస్తున్న విష ప్రచారాన్ని, కొన్ని పార్టీల దుష్ప్రచారాన్ని సమర్ధంగా తిప్పికొట్టాలన్నారు. విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టకపోతే అవే నిజాలని ప్రజలు భ్రమించే ప్రమాదం ఉందన్నారు. వ్యవసాయం దండగని గతంలో తానన్నట్లుగా ప్రత్యర్థుల దుష్ప్రచారాన్ని సకాలంలో తిప్పికొట్టనందువల్ల, ఎంతో డేమేజీ జరిగిందన్నారు. తర్వాత తానే స్వయంగా జోక్యం చేసుకుని ఎక్కడ అన్నాను, ఎప్పుడు అన్నాను నిరూపించాలని ఛాలెంజ్ చేసేసరికి సైలెంట్ అయ్యారని గుర్తుచేశారు.
రాజకీయ పునరేకీకరణ వల్లే ఒడిశాలో బిజూ జనతాదళ్ వరుసగా నాలుగుసార్లు గెలుపొందిందని, సింగపూర్‌లో 50 ఏళ్లుగా ఒకే పార్టీ అధికారంలో ఉందని అంటూ, ప్రజామోదం ఉన్న పార్టీలకు ఓటమి ఉండదన్నారు.
పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కళా వెంకట్రావు మాట్లాడుతూ కార్యకర్తల పార్టీ టిడిపి అని ప్రత్యర్థులు కూడా అంగీకరించే సత్యంగా చెప్పారు. కార్యకర్తల సంక్షేమం కోసం చేపడుతున్న నవసూత్రాల గురించి వివరించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతూ కార్యకర్తల స్వయం ఉపాధి కార్యక్రమాలకు ఇకపై ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించి పలు నమూనాలను అధ్యయనం చేస్తున్నామన్నారు. ప్రతి నియోజకవర్గానికి 100 మందిని గుర్తించాలని ఎమ్మెల్యేలను కోరారు. వారిని వడపోసి చేసి ఎంటర్‌ప్రెన్యూర్లుగా మార్చే బాధ్యత పార్టీ తీసుకుంటుందన్నారు. హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, ప్రతిభాభారతి, కాలువ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..మంగళవారం విజయవాడలో జరిగిన పార్టీ ప్రజాప్రతినిధుల సదస్సులో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు