రాష్ట్రీయం

భారత్‌లో బలహీనపడ్డ ఐఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 20: దిల్‌సుఖ్‌నగర్ బాంబుపేలుళ్ల కేసులో రెండో నేరగాడు, సూత్రధారి రియాజ్ సోదరుడైన యాసిన్ భత్కల్ దొరకడం వల్లనే ఈ కేసు విచారణ తొందరగా ముగిసింది. యాసిన్ ఇంటరాగేషన్ వల్ల ఈ కేసులోని ఒక్కో అంశం ఒక్కొక్కటిగా విడిపోతూ వ చ్చింది. ఈ భత్కల్‌ను పట్టుకోవటానికి ఇంటెలిజెన్స్ బ్యూ రో, బీహార్ పోలీసులు ఆరు నెలల పాటు అహర్నిశలు కష్టపడ్డారు. ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుల్లో ఒకడైన యాసిన్ దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసులో ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు మరణ శిక్ష ఖరారు చేసిన విషయం విదితమే. 2013 ఫిబ్రవరి 21వ తేదీన దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కుట్ర సూత్రధారుల్లో ఒకడైన ఇతను సహచర ఐఎం సభ్యులతో అనేకసార్లు ఫోన్లలో మాట్లాడాడు. ఈ సంభాషణలను ఇంటెలిజెన్స్ బ్యూరో పసిగట్టింది. మొదట బీహార్‌లోని ఒక అజ్ఞాత ప్రదేశంలో దాక్కుని ఉన్నాడని కేంద్ర నిఘా విభాగం పసిగట్టింది. ఆ తరువాత ఇండోనేపాల్ సరిహద్దుల్లో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. యాసిన్‌తో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న అసదుల్లా అక్తర్‌ను కూడా సరిహద్దుల్లోనే పట్టుకున్నారు. తరచుగా ఒకరికొకరు మొబైల్ ఫోన్ల ద్వారా మెసేజ్‌లు పంపుకోవడం వల్ల పోలీసులు యాసిన్ డెన్‌ను కనుగొన్నట్లు ఎన్‌ఐఏ వర్గాలు పేర్కొన్నాయి. యాసిన్ అరెస్టుతో ఇండియన్ ముజాహిదీన్ వెన్ను విరిచినట్లయింది. యాసిన్‌ను భారత్-నేపాల్ సరిహద్దుల్లో బీహార్ పరిధిలో రాక్సుల్ అనే గ్రామం వద్ద డెన్‌లో ఉండగా, రెండు రోజుల పాటు పోలీసులు జాగ్రత్తగా వేచి ఉండాల్సి వచ్చి ంది. చివరకు యాసిన్, అసదుల్లా అక్తర్‌ను పట్టుకున్న తర్వాత వారి వద్ద నుంచి ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి ద్వారా ఐఎంకు సంబంధించిన అనేక కీలక విషయాలను పోలీసులు తెలుసుకున్నారు. ల్యాప్‌టాప్‌లో విషయాలను తెలుసుకున్న తర్వాత ఈ కేసులో ఇతర నిం దితులు తహసీన్ అక్తర్, జి యా ఉర్ రెహమాన్ అలియా స్ వక్వాస్‌ను పోలీసులు అరె స్టు చేశారు. వీరి వద్ద నుంచి కూడా ఎలక్ట్రానిక్ సం బంధించిన వస్తువులు పోలీసులు స్వాధీనం చేసుకున్నా రు. ఈ ల్యాప్‌టాప్‌లో ఉన్న సమాచారాన్ని డీకోడ్ చేశారు. అనంతరం పేలుళ్ల ప్రధాని సూత్రధారి, ఐఎం ప్రధాన వ్యవస్ధాపకుడు రియాజ్ భత్కల్ పాకిస్తాన్‌లో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. యాసిన్, అసదుల్లాను వేరువేరుగా విచారించిన తర్వాత దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో జరిగిన పేలుళ్ల వెనక ఉన్న వ్యక్తుల వివరాలు, మిస్టరీగా ఉన్న అనేక అంశాల గుట్టు రట్టయిందని ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు. ఈ కేసులోనే కాకుండా అనేక పేలుళ్లలో యా సిన్ భత్కల్ పేలుళ్ల పథకాన్ని అమలు చేయడంలో దిట్ట అని తేలిందన్నారు. యాసిన్ భత్కల్ భారత్ వ్యతిరేకతను తన పరిధిలోకి వచ్చిన యువతకునూరిపోసేవాడని పోలీసులు తెలిపారు. ఒక ముక్కలో చెప్పాలంటే యాసిన్ ఆల్ రౌండర్. యాసిన్ భత్కల్ తర్వాత దేశంలో ఇండియన్ ముజాహిదన్ పేరిట పేలుళ్ల ఘటనలు నిలిచిపోయాయి. ఈ కేసులో కీలకమైన విషయమేమిటంటే దిల్‌సుఖ్‌నగర్‌పేలుళ్లు జరిగిన ప్రాంతంలో ఒక షాపింగ్ మాల్ వద్ద లభించిన సిసిటివి ఫుటేజిలో వక్వాస్, తహసీన్ సైకిళ్లు పట్టుకున్నట్లు విజు వల్స్ లభించాయి. అలాగే బాంబులు ఎలా అమర్చారో కూడా సిసిటివి ఫుటేజిలో దృశ్యాలు లభించాయి. దీంతో దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసుకు పాల్పడిన దోషులను పట్టుకునేందుకు మార్గం సుగమమైనట్లు ఎన్‌ఐఏ పోలీసులు తెలిపారు.