రాష్ట్రీయం

సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, డిసెంబర్ 20: సింగరేణి సంస్థలో వారసత్వ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. 18 ఏళ్ల తరువాత మళ్లీ వారసత్వ ఉద్యోగావకాశాలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల నియామకాలకు ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు ఆ సంస్థ చైర్మన్ అండ్ ఎండి ఎన్ శ్రీ్ధర్ మంగళవారం ప్రకటించారు. అయితే ఈ ఉద్యోగాల నియామకాల దరఖాస్తులను జనవరి ఒకటో తేదీ నుంచి స్వీకరిస్తామని చైర్మన్ శ్రీ్ధర్ తెలిపారు. వారసత్వ ఉద్యోగాల ప్రకటనతో వేలాది మంది సింగరేణి కుటుంబాలలో సంతోషం వ్యక్తమవుతోంది. 18ఏళ్ల సుదీర్ఘ కాలం తరువాత మళ్లీ సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరించడం పట్ల ముఖ్యమంత్రికి సింగరేణి సంస్థ చైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయంతో సీనియర్ కార్మికులకు, వారి పిల్లలకే కాకుండా కంపెనీకి, రాష్ట్రానికి ఎంతో మేలుకలుగుతుందన్నారు. ఇప్పటికే సింగరేణి 3నోటిఫికేషన్లు ఇచ్చి 18 రకాల ఉద్యోగాలలో దాదాపు 2500 మంది యువకులకు ఉద్యోగాలు ఇచ్చిందని, కొత్త ఉత్తర్వులతో మరో 30వేల మందికి పైగా యువకులను చేర్చుకునే అవకాశం ఉందని సంస్థ చైర్మన్ శ్రీ్ధర్ తెలిపారు.