రాష్ట్రీయం

పండుగొచ్చింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, డిసెంబర్ 22:ముఖ్యమంత్రి దత్తత గ్రామాలైన ఎర్రవెల్లి, నరసన్నపేటల్లో డబుల్ బెడ్‌రూమ్స్ ప్రారంభోత్సవం జరగనుంది. ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో శుక్రవారం తెల్లవారుజామున లబ్ధిదారులు సామూహిక గృహ ప్రవేశం చేయనున్నారు. గృహ ప్రవేశాల అనంతరం సామూహిక సత్యనారాయణ వ్రతానికి కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7.44 గంటలకు ఎర్రవల్లి గ్రామంలోని ఫంక్షన్ హాల్ వద్ద సిఎం కెసిఆర్ దంపతులు వ్రతాన్ని ప్రారంభించిన మరుక్షణమే 7.45 గంటల ప్రాంతంలో సైరన్ మోగనుంది. సైరన్ శబ్దం వినిపించగానే అప్పటికే ఏర్పాటు చేసుకున్న వ్రత మంటపాల వద్ద దంపతులు కూర్చుని పూజలు నిర్వహించనున్నారు. పూజకు అవసరమైన కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, అగరుబత్తీలుసహా ఇతర పూజాసామగ్రిని అధికారులు అన్ని ఇళ్లకు పంపిణీ చేశారు. గృహ ప్రవేశాలు, సత్యనారాయణ వ్రతాలు నిర్వహించేందుకు దాదాపు 600మంది పురోహితులను ప్రత్యేకంగా రప్పిస్తున్నారు. వ్రతాలు నిర్వహించే వారు అవసరమైన మంటపాలు, మామిడి ఆకులు, చెరకు గడలు, అరటి మొక్కలు తదితర సామగ్రిని కొనితెచ్చుకోవడంలో నిమగ్నమయ్యారు. ఉన్న ఇళ్లను కూల్చివేసి కొత్తగా నిర్మించడంతో సిసి రోడ్లపై పేరుకుపోయిన మట్టిని కడిగేసి శుభ్రపరుస్తున్నారు. తమకు కేటాయించిన ఇళ్లను సైతం మహిళలు శుభ్రంగా కడిగి గడపలకు పసుపు పూసి సిద్ధం చేసుకుంటున్నారు. ఇళ్ల కాలనీలో పిల్లలు ఆడుకునేందుకు పార్కును కూడా ఏర్పాటు చేశారు.
వ్రతం పూర్తయిన అనంతరం ముందుగా ఎర్రవల్లి గ్రామంలోని అన్ని వీధులనూ సిఎం కెసిఆర్ స్వయంగా కలియదిరిగి పర్యవేక్షించనున్నారు. అనంతరం నర్సన్నపేట గ్రామానికి వెళ్లి అక్కడ కూడా డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలను, రోడ్లు, ఇతర వసతులను సిఎం పరిశీలించనున్నారు. నగదు రహిత లావాదేవీలపై బ్యాంకర్లు రెండు గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించి, ఇప్పటికే కార్డులు అందజేశారు. కార్యక్రమం అనంతరం అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు సిఎం హైదరాబాద్ తిరిగి వెడతారు. భద్రతాపరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా సిద్దిపేట పోలీసు కమిషనర్ శివకుమార్ బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. డబుల్ బెడ్‌రూమ్‌ల ఇళ్ల నిర్మాణం పూర్తికావడంతో ఇప్పటివరకూ ఊరి చివర పూరి పాకల్లో మగ్గుతున్న జనం 14 నెలల వనవాసం పూర్తయినట్టే.
నిర్మాణంలో మరో 80 ఇళ్లు
డబుల్ బెడ్‌రూమ్ పథకం కింద 2015 అక్టోబర్ 22న విజయ దశమినాడు ఎర్రవెల్లిలో 380 ఇళ్లకు, నర్సన్నపేటలో 220 ఇళ్లకు సిఎం శంకుస్థాపన చేశారు. వీటిలో 80 ఇళ్లు మాత్రం ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి.

చిత్రం..నర్సన్నపేటలో ప్రారంభానికి ముస్తాబైన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు