రాష్ట్రీయం

కామాంధుడికి ఉరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, డిసెంబర్ 22: అత్యాచారం, హత్య కేసులో కరీంనగర్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అభం శుభం తెలియని మూ డున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టి అనంతరం హత్య చేసిన కామాంధుడు జక్కుల వెంకటస్వామి (30)కి గురువారం సాయంత్రం కరీంనగర్ మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి బి.సురేష్ ఉరిశిక్షను ఖరారు చేస్తూ తీర్పును వెలువరించారు.
కోర్టు తీర్పును మహిళా సంఘాలు స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేయగా, చిన్నారి కుటుంబ సభ్యుల్లో సైతం ఆనందం వెల్లివిరిసింది. ఈ సంచలన తీర్పుకు సంబంధించి ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కాటారం మండలం దామెరకుంటలో తొగరి రాజస్వామి భార్యాపిల్లలతో నివసిస్తూ కాటారం పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. అతని చిన్న కూతురు వినయ్‌శ్రీ (మూడున్నరేళ్లు) అదే గ్రామంలోని అంగన్‌వాడీ పాఠశాలలో చదువుకుంటోంది. అయితే, 2016 ఫిబ్రవరి 27న ఎప్పటిమాదిరిగానే చిన్నారి పాఠశాలకు వెళ్లి తిరిగి అక్క, అన్నతో కలిసి ఇంటికి వస్తుండగా, మధ్యాహ్న సమయంలో అదే గ్రామానికి చెందిన కామంతో కళ్లుమూసుకుపోయిన కామాంధుడు జక్కుల వెంటస్వామి ఇంటి ముందుకు రాగానే చాక్లెట్ల ఆశజూపి వినయ్‌శ్రీని పిలుచుకుని ఇంటిలోకి తీసుకెళ్లాడు. వినయ్‌శ్రీతో ఉన్న అక్క, అన్నలను వెంకటస్వామి భయపెట్టి అక్కడి నుండి పంపించివేశాడు. అనంతరం ఆ అభం శుభం తెలియని చిన్నారిపై వెంకటస్వామి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకుగాను అనంతరం చిన్నారిని గొంతునులిమి హత్య చేశాడు. అయితే, చిన్నారి రాత్రైనా తిరిగి ఇంటికి రాకపోయేసరికి తల్లిదండ్రులు ఆందోళనకు గురై గ్రామమంతా వెతికారు. పక్కనే ఉంటున్న నిందితుడు వెంకటస్వామి ఇంటికి వెళ్లి చూడగా తాళం వేసి ఉంది. దీంతో అనుమానంతో ఇంటిలోని కిటికీ నుంచి లోనికి చూడగా ఇంట్లో మూలకు చిన్నారి గౌను కనిపించగా, తాళం పగులగొట్టి చూశా రు. గంప కింద బాలిక శవం కన్పించింది.
పోలీసులు నిందితుడిపై సెక్షన్ 302, 376 ఐపిసితోపాటు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అప్పటి ఎఎస్‌పి విష్ణు వారియర్ ఆధ్వర్యంలో నిందితున్ని అరెస్ట్ చేసి కోర్టుకు పంపి, అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసి 17మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేందర్, నిందితుడి తరపున న్యాయవాది మధ్య వాదనలు ప్రతిపాదనలు జరిగాయి. చివరకు కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి బి.సురేష్ నిందితుడు జక్కుల వెంకటస్వామికి ఉరిశిక్షతోపాటు జరిమానా విధిస్తూ సంచలనమైన తీర్పును వెల్లడించారు.కేవలం పది నెలల వ్యవధిలోనే నిందితుడికి కోర్టు ఉరిశిక్ష ఖరారు చేస్తూ తీర్పునివ్వడం పట్ల మహిళా సంఘా లు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అటు చిన్నారి కుటంబసభ్యులు కూడా న్యాయం జరిగిందంటూ ఆనందం వ్యక్తం చేశారు. అయితే, నిందితుడు అరెస్ట్ అయినప్పటి నుంచి జైలులోనే ఉంటున్నాడు.