రాష్ట్రీయం

భార్య పిల్లలకు విషమిచ్చి ఆపై ఉరేసుకొని ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/నార్సింగ్, జనవరి 4: ఆర్థిక ఇబ్బందులు ఓ కుటుంబాన్ని బలి తీసుకున్నాయి. చిరువ్యాపారంతో జీవనం సాగిస్తున్న ఓ యువకుడు వ్యాపారంలో నష్టపోయాడు. ఉపాధి కోసం రెండు నెలలుగా చేసిన ప్రయత్నం ఫలించలేదు. జీవితంపై విరక్తితో భార్య, పిల్లలకు విషమిచ్చి, తాను ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందిన హృదయ విదారక సంఘటన పాతబస్తీలోని సీతారాంబాగ్‌లో చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలావున్నాయి. హబీబ్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని సీతారామ్‌బాగ్ కురుమబస్తీకి చెందిన నరువా బాల్‌రాజ్ (30) కొనే్నళ్ల నుంచి ఎల్‌బి నగర్‌లో ఓ స్క్రాప్ దుకాణం నిర్వహిస్తున్నాడు. దుకాణం సరిగ్గా నడవక తీవ్రంగా నష్టపోయాడు. ముందే చిరువ్యాపారం ఆపై నష్టంతో ఎటూపాలుపోని బాల్‌రాజ్ రెండు నెలల క్రితం దుకాణం ఎత్తివేశాడు. అప్పటినుంచి ఖాళీగానే ఉంటున్న బాల్‌రాజ్‌కు ఉపాధి కరువైంది.
దీనికి గతంలో చేసిన అప్పులు తోడవ్వగా తీవ్ర మనస్థాపం చెందాడు. ఈక్రమంలో భార్య పిల్లలను పోషించలేని దుస్థితి నెలకొంది. అతనికి ఇద్దరు కవలలు (13నెలల ఆడ పిల్లలు) ఆదివారం రాత్రి బాల్‌రాజ్ భార్య సురేఖ (24)తో పాటు చిన్నారులు మేధా, మేఘనకు గుర్తు తెలియని విషం ఇచ్చాడు. గాఢ నిద్రలో వారు మృతి చెందారు. కాగా అదే రాత్రి బాల్‌రాజు ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతి చెందాడు.
సోమవారం ఉదయం ఎంత కొట్టినా తలుపులు తెరవకపోవడంతో చివరికి మృతుడి సోదరుడు కిటికీలోంచి చూడగా, బాల్‌రాజు ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. మృతుడి భార్య సురేఖతో పాటు పిల్లలు కూడా నిస్సహాయ స్థితిలో పడి ఉన్నారు. వెంటనే స్థానికులకు, ఫోన్‌లో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఇన్‌స్పెక్టర్ సంజయ్ నేతృత్వంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే వీరి మృతికి ఆర్థిక ఇబ్బందులే కారణమని భావిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.