రాష్ట్రీయం

భోగి పిడకలతో రికార్డుల్లోకి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తణుకు, జనవరి 4: సంక్రాంతికి భోగిమంటలో వేసే భోగి పిడకలతో ఒక వ్యక్తి రికార్డు సృష్టించాడు. 3.2 లక్షల భోగి పిడకలతో నాలుగు కిలోమీటర్ల పొడవైన దండను రూపొందించడం ద్వారా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. వివరాలిలావున్నాయి... పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన అనుకుల ప్రసాద్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం కోసం భోగి పిడకల దండను రూపొందించాడు. తణుకు పట్టణంలోని చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల డాప్రాంగణంలో సోమవారం భోగి పిడకల దండను ప్రదర్శించాడు. 3.2 లక్షల పిడకలతో 4 కిలోమీటర్ల పొడవున ఏర్పాటుచేసిన ప్రదర్శన అందరినీ ఆకర్షిస్తోంది. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినాల్లో ప్రత్యేక ప్రాధాన్యత ఉన్న భోగి మంటల నేపధ్యంలో ఈ పిడకలను ఎంతో కష్టపడి సేకరించినట్లు చెప్పారు. మన సంస్కృతిని పరిరక్షించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు పిడకలు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. కాగా ఈ భారీ భోగి పిడకల ప్రదర్శనను తెలుగు బుక్ ఆఫ్ రికార్డు రాష్ట్ర పరిశీలకుడు డాక్టర్ సాయిశ్రీ పరిశీలించి ప్రసాద్‌కు సంస్థ తరపున అర్హతా పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంతకు ముందు లక్షా 62 వేల పిడకలతో రికార్డు ఉండగా, దానిని ఈ ప్రదర్శన అధిగమించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత సుశర్మ, పారిశ్రామిక వేత్త గమిని రాజా తదితరులు పాల్గొన్నారు.

భారీ భోగి పిడకల దండ* ప్రసాద్‌కు అర్హతా పత్రాన్ని ఇస్తున్న డాక్టర్ సాయిశ్రీ