రాష్ట్రీయం

కాళేశ్వరం-సిరోంచి వంతెన నేడే ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 29:గోదావరి నదిపై మహారాష్ట్ర-తెలంగాణ రాష్ట్రాలను కలుపుతూ చేపట్టిన ప్రతిష్ఠాత్మక వంతెన శుక్రవారం ప్రారంభం కానుంది. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి పథకం కింద తెలంగాణలోని కాళేశ్వరం- మహారాష్టల్రోని సిరోంచి మధ్య రూ.292 కోట్లతో ఈ వంతెన నిర్మాణం చేపట్టారు. వంతెన నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరు చేయగా, మహారాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో నిర్మాణం పూర్తయింది. 1.6 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెన మహారాష్ట్ర- తెలంగాణ- చత్తీస్‌గఢ్ రాష్ట్రాలను అనుసంధానిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్-రాయ్‌పూర్ (చత్తీస్‌గఢ్ రాజధాని)ల మధ్య దూరం తగ్గుతుంది. మహారాష్టల్రోని గడ్చిరోలి, చంద్రాపూర్ ప్రాంతాలు ఒకప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలోనే ఉండేవి. మహారాష్ట్ర రూపుదాల్చడంతో ఈ ప్రాంతాలు ఆ రాష్ట్రంలో కలిశాయి. అయితే ఇప్పటికీ ఆ ప్రాంతాల్లోని అధికశాతం ప్రజలు తెలుగే మాట్లాడతారు. వంతెన పూర్తి కావడంతో
వీరు తెలంగాణ ప్రాంతాలకు రాకపోకలు జరపడం మరింత సులువవుతుంది. అలాగే కరీంనగర్ జిల్లా కాళేశ్వరం, మహదేవపూర్ మండలాల ప్రజలు అటు మహారాష్ట్ర వెళ్లేందుకు సానుకూలమవుతుంది. గతంలో ఈ ఇరు ప్రాంతాలవారూ పడవలపై రాకపోకలు సాగించేవారు. కాళేశ్వరం- సిరోంచి వంతెనను మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్‌రావు శుక్రవారం ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవానికి మహారాష్ట్ర సిఎం ఫడ్నవీస్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరవుతారు.
ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో రహదారుల నిర్మాణం కోసం 1290 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు కూడా కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఈ ప్రతిపాదనకు త్వరలో కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలపనున్నట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కేంద్రం నుంచి సమాచారం అందింది. తీవ్రవాద ప్రభావిత జిల్లాలైన ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మంలలో రోడ్ల నిర్మాణానికి ఈ నిధులను వెచ్చిస్తారు.