ఆంధ్రప్రదేశ్‌

బాబుకు బహుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 31: పట్టిసీమ నీటి ద్వారా 36వేల హెక్టార్లలో 37 నుంచి 45 బస్తాల ధాన్యం దిగుబడి సాధించినందులకుగాను కృతజ్ఞతగా అవనిగడ్డ నియోజకవర్గ రైతులు డిప్యూటీ స్పీకర్ మండలి బుద్దప్రసాద్ నాయకత్వంలో నడకుదురు శ్రీకృష్ణదేవాలయంలో కొత్తగా పండిన ధాన్యంతో పూజలు చేసి, పొంగల్ వండి, జున్ను వండి, అటుకులు ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఇచ్చి పూలకిరీటం, వరి కంకులతో గుత్తి ఇచ్చి సన్మానించారు. ఈ సందర్భంగా బుద్దప్రసాద్ మాట్లాడుతూ పట్టిసీమ ద్వారా 60 టిఎంసిల నీరు కాలువల చివరి ప్రాంతమైన అవనిగడ్డకు నీటి రావడం వలన మా ప్రాంతంలో పంటలు పండాయన్నారు. ఇది రైతులు ఆనందంతో చేసిన కార్యక్రమమని తెలిపారు. జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ శ్రీకృష్ణుడికి కుచేలుడు అటుకులు ఇచ్చిన విధంగా పట్టిసీమ ద్వారా నీరు ఇవ్వటం వల్ల పంటలు పండాయని కృతజ్ఞతలు తెలిపారు. ఒక ఎకరం కలిగిన రైతు తనకు పండిన తొలిపంటలో అటుకులు తెచ్చి మీకిచ్చాడన్నారు. రైతులు చూపించిన కృతజ్ఞతకి బాబు ఆనందం వ్యక్తం చేశారు.

చిత్రం... పట్టిసీమ పంటతో తయారు చేసిన ప్రసాదాన్ని చంద్రబాబుకు అందజేస్తున్న రైతు