రాష్ట్రీయం

సమస్యలు పరిష్కరించలేని గ్రామసభలెందుకు: ఎంపీ గల్లా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుళ్లూరు, జనవరి 4: ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన జన్మభూమి - మా ఊరు కార్యక్రమం నిర్వహణ తీరుపై గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ అసహనం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడం, వెలగపూడి, రాయపూడి గ్రామాల్లో 13లక్షల రూపాయల వంతున సర్వశిక్షా అభియాన్ నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదులను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో సమస్యలు పరిష్కరించని కార్యక్రమాల వల్ల ఉపయోగం లేదన్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి అధికారులు మరింత చొరవ చూపాలని జయదేవ్ సూచించారు. మళ్లీ జన్మభూమి నాటికి సమస్యలు లేకుండా చూడాలని ఆదేశించారు.
ప్రజలతోనే తన్నిస్తా:ఎమ్మెల్యే
వెలగపూడి గ్రామస్తులు రెవెన్యూ అధికారులపై ఫిర్యాదు చేయటంతో తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తక్షణమే సమస్యలు పరిష్కరించకపోతే ప్రజలతోనే తన్నిస్తానని అధికారులను హెచ్చరించారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీల సమాచారాన్ని సర్పంచ్‌లకు ఎందుకు తెలియజేయడం లేదని అటవీ శాఖ అధికారులను ఆయన నిలదీశారు.
నా సంగతి
మీకు తెలియదు
విలేఖరులపై మండిపడ్డ సిఎం
మార్కాపురం, జనవరి 4 : మార్కాపురం బహిరంగ సభలో విలేఖరులపై సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కాపురం యాచవరం గ్రామంలో జన్మభూమి బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తుండగా ప్రెస్ గ్యాలరీ నుంచి కొంతమంది జర్నలిస్టులు ప్లకార్డులు ప్రదర్శించారు. దీనిపై సిఎం వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హెల్త్‌కార్డులకు సంబంధించి ప్రభుత్వ వాటాను చెల్లించాలని కోరుతూ విలేఖరులు ప్లకార్డులు ప్రదర్శించడంతో సిఎం ఆగ్రహానికి గురయ్యారు. ‘మిమ్మల్ని చూసి భయపడ్డానికి మీరేమి తీవ్రవాదులు కాదు, వేలమంది ప్రజలు వచ్చి ఉంటే మీ ఐదుగురు సభను అడ్డుకోవడం సరైనచర్య కాదు. నా సంగతి మీకు తెలియదు, అసలు చేయను’ అంటూ ఒక్కసారిగా కోపోద్రిక్తుడయ్యారు. మీరు సభ్యత సంస్కారం నేర్చుకొని సరైన రీతిలో వస్తే సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తానే తప్ప, బెదిరించాలనుకుంటే బెదిరే మనిషిని కానంటూ హెచ్చరించారు. పాత్రికేయులు తీవ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతో పెట్టుకుంటే చాలా నష్టపోతారని, తనను తక్కువ అంచనా వేయవద్దని బహిరంగ సభలో వేదికపై నుంచి హెచ్చరికలు జారీ చేశారు.