రాష్ట్రీయం

పెద్దనోట్ల రద్దుపై దేశవ్యాప్త ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జనవరి 2: పెద్దనోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం అనుసరించిన వైఖరిని నిరసిస్తూ భారీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, మాజీ మంత్రి శ్రీ్ధర్‌బాబు తెలిపారు. సోమవారం వారు ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దుతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రిజర్వు బ్యాంకు 50 రోజుల్లో జారీ చేసిన వివిధ నిబంధనల్లో 126సార్లు మార్పులు చేయటం అడ్డగోలు విధానానికి అద్దం పట్టిందని వారు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నామని చెప్పారు. ఈ నెల 7న అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు, 9న మహిళలతో ఆందోళనలు, 11న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో భారీ ఆందోళనలు చేపట్టనున్నట్లు చెప్పారు. నోట్ల రద్దు దేశంలోనే పెద్ద కుంభకోణమని ఆరోపించారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ ఖాతాల్లో నగదు జమ వివరాలు ప్రకటించమని డిమాండ్ చేసినా స్పందించేవారు లేరన్నారు. 2016 సెప్టెంబర్‌లో 5.88 లక్షల కోట్ల రూపాయలు బ్యాంక్‌లకు డిపాజిట్లుగా వచ్చాయని, ఇందులో 3లక్షల కోట్లకు పైగా ఫిక్స్‌డ్ డిపాజిట్లేనన్నారు. ప్రధాని మోదీ ప్రకటన కంటే ముందే ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్‌లో బిజెపి నేత వద్ద 3కోట్ల రూపాయలు దొరికాయన్నారు. బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా డైరెక్టర్‌గా ఉన్న అహ్మదాబాద్‌లోని కేంద్ర సహకార బ్యాంక్‌లో నోట్ల రద్దుకు మూడురోజుల ముందే ఆయన 500కోట్ల రూపాయలను డిపాజిట్ చేశారని ఆరోపించారు. బిజెపి నాయకుడు గాలి జనార్ధన్‌రెడ్డి 100 కోట్ల రూపాయల నోట్లు మార్పిడి చేశారని, ఆయన అనుచరుడే లేఖరాసి ఆత్మహత్య చేసుకున్నాడన్నాడు. నోట్ల రద్దు వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, కూరగాయలు, ఉల్లిగడ్డల ధరలు పడపోయి రైతులను వేదనకు గురిచేస్తున్నాయన్నారు.

విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న భట్టివిక్రమార్క, శ్రీ్ధర్‌బాబు