రాష్ట్రీయం

పూర్ణాహుతితో ముగిసిన భవానీ దీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఇంద్రకీలాద్రి), జనవరి 4: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో భవానీ దీక్షల విరమణ కార్యక్రమం సోమవారంతో ముగిసింది. హోమగుండంలో దుర్గగుడి ఇవో దంపతులు సిహెచ్ నరసింగరావు, విజయలక్ష్మి దంపతులు పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. భవానీ దీక్షల విరమణ సందర్భంగా ఐదురోజులకు కలిసి సుమారు 7లక్షల మంది భవానీలు అమ్మవారి సన్నిధిలో భక్తిశ్రద్ధలతో దీక్షలు విరమించారు. ఇంద్రకీలాద్రిపై ఉన్న యాగశాలలో సోమవారం ఉదయం 11గంటలకు దేవస్థానం స్థానాచార్యుడు విష్ణ్భుట్ల శివప్రసాద్ ఇవో దంపతులను హోమగుండం ముందు కూర్చోబెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోమగుండంలో పూజాసామగ్రిని వేయించి ప్రదక్షిణలు చేయించారు. కొబ్బరికాయలు కొట్టించి వారికి సమస్త దేవతల ఆశీస్సులు అందజేయటంతో అమ్మవారి సన్నిధిలో గత సంవత్సరం డిసెంబర్ 31న వైభవంగా ప్రారంభమైన భవానీ దీక్షల విరమణ కార్యక్రమం ముగిసింది. అమ్మవారికి ప్రీతిపాత్రులైన భవానీలు ఐదురోజులు ప్రశాంత వాతావరణంలో దుర్గమ్మను దర్శించుకున్నారు. ఎలాంటి అపశృతులు దొర్లకుండా ఇవో నరసింగరావు ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకున్నారు. కిందిస్థాయి సిబ్బందికి నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన భవానీలు అమ్మవారిని ప్రశాంతంగా దర్శించుకునేలా విస్తృత ఏర్పాట్లు చేశారు. చివరి రోజైన సోమవారం రాత్రి 8గంటలకు సమయానికి 5రోజులకు కలిపి సుమారు 14లక్షల మేరకు లడ్డూలను భవానీలు కొనుగోలు చేశారు. ఆదివారం రాత్రి నుండే భవానీలు పెద్దసంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. ఈ ఐదురోజులు భవానీలు, భక్తులకు నిత్యం సుమారు 10వేల మందికి అన్నదాన పథకం ద్వారా భోజనాలు పెట్టారు.

చివరి రోజు దీక్షల విరమణకు పోటెత్తిన భవానీలు