తెలంగాణ

మార్చిలోగా చెల్లిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 5:్ఫజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను మార్చి 31లోగా చెల్లించనున్నట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ గురువారం శాసన సభలో ప్రకటించారు. ఏ సంవత్సరం ఫీజు ఆ సంవత్సరం చెల్లించడం సాధ్యం కాదని, ఈ పథకం రూపకల్పనే అలా ఉందని చెప్పారు. గత ఏడాది బకాయిలు ఆర్థిక సంవత్సరం చివరలో చెల్లించడం మొదటినుంచి వస్తున్నదేనని, ఇప్పుడు కూడా అదేవిధంగా చెల్లించనున్నట్టు చెప్పారు. ఉదయం పది గంటలకు ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగానే ప్రతిపక్ష నాయకుడు కె జానారెడ్డి లేచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై బుధవారం ముఖ్యమంత్రి ప్రకటన తరువాత వివరణ అడిగేందుకు, నిరసన తెలిపేందుకు అవకాశం ఇవ్వకుండా అర్థంతరంగా సభను వాయిదా వేశారని, అసంపూర్తిగా ముగిసిపోయిన ఈ అంశంపై తిరిగి చర్చించాలని డిమాండ్ చేశారు. సభలోనే ఉన్న ముఖ్యమంత్రి కెసిఆర్ సుముఖత వ్యక్తం చేశారు. తనకూ అలానే అనిపించిందని, సభ్యులు ఎన్ని ప్రశ్నలు అడిగినా చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయం తరువాత ఈ అంశంపై సభ్యులు అడిగితే వివరంగా చెబుతానన్నారు. ప్రశ్నోత్తరాల తరువాత వివిధ పార్టీల సభ్యులు మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎప్పటిలోగా చెల్లిస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై సిఎం మాట్లాడుతూ మార్చి 31 నాటికి 2015-16 బకాయిలు చెల్లించనున్నట్టు చెప్పారు. అప్పటి సిఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2010-11లో ఈ పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచే బకాయిలు ఉంటూ వస్తున్నాయని, తెలంగాణ ఆవిర్భావం నాటికి 1880 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని వివరించారు. ఈ పథకం కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఈ పథకంలో మార్పులు చేసేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోనున్నట్టు చెప్పారు.
ఇంజనీరింగ్ కాలేజీలు మూత పడుతున్నాయని కొందరు సభ్యులు చేసిన వాఖ్యలను కెసిఆర్ ప్రస్తావిస్తూ, కొన్ని మూత పడతాయి, కొన్ని కాలేజీలు కొత్తగా వస్తాయని వ్యాఖ్యానించారు. నాణ్యమైన విద్యను అందించని కాలేజీలు మూత పడాల్సిందేనని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కొనసాగిస్తూనే కేజీ టూ పిజీ ఉచిత విద్య, గురుకుల పాఠశాలలు ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. ప్రైవేటు యూనివర్సిటీలు కూడా వస్తున్నాయన్నారు. ఇప్పటివరకు 4687 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించినట్టు, ఇందులో 1880 కోట్ల రూపాయలు గత ప్రభుత్వ హయాంలోని బకాయిలేనని వివరించారు.
నోట్ల రద్దుకు మద్దతు
కరెన్సీ రద్దు వల్ల ఆదాయంపై ప్రభావం పడిందని మంత్రి చెప్పారని, ముఖ్యమంత్రి మాత్రం అందుకు విరుద్ధంగా నోట్ల రద్దును సమర్ధించారని ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ విమర్శించారు. దీనిపై సిఎం స్పందిస్తూ కరెన్సీ రద్దును ఇప్పటికీ సమర్ధిస్తున్నాననీ, దీని ఫలితాలు త్వరలో కనిపిస్తాయనీ ధీమా వ్యక్తం చేశారు. రద్దు వల్ల తాత్కాలికంగా దేశంలో అన్ని రాష్ట్రాలపై ప్రభావం పడుతుందని, అదే విధంగా మన రాష్ట్రంపై కూడా ప్రభావం ఉందని అన్నారు.