రాష్ట్రీయం

తెలుగురాని పిల్లలు.. నీళ్లు నమిలిన టీచర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బాబూ.. ‘అ’ తరువాత ఏ అక్షరం వస్తుందో తెలుసా? ఒకటో తరగతి
విద్యార్థికి కలెక్టర్ ప్రశ్న. తెలీదంటూ తల అడ్డంగా తిప్పాడు ఆ విద్యార్థి. ‘ఇ’ తరువాత వచ్చే అక్షరమేంటో తెలుసా? అంటూ రెండో తరగతి విద్యార్థిని అడిగారు కలెక్టర్. తెలీదనే సమాధానమే ఎదురైంది. అంతేకాదు,
మరో నలుగురైదుగురి నుంచీ అదే జవాబు..
పిల్లలూ.. మీ పేర్లు, తల్లిదండ్రుల పేర్లు తెలుగులో బోర్డుమీద రాయండర్రా...అంటూ ఏడో తరగతి పిల్లల్ని పిలిచారు. ఒకరిద్దరు తప్పులతో రాస్తే, నలుగురైదుగురు అసలే రాయలేకపోయారు. పోనీ ఇంగ్లీషులోనైనా
రాయగలరా? అన్న కలెక్టర్ ప్రశ్నకు సమాధానం లేదు. సొంత పేరు సైతం రాయలేని విద్యార్థులను చూసి తెల్లబోయిన కలెక్టర్.. హెడ్‌మాస్టర్ సహా ఐదుగురు టీచర్లను సస్పెండ్ చేశారు.

**
మహబూబ్‌నగర్/ మిడ్జిల్, జనవరి 9: సర్కారీ బడుల్లో చదువుల తీరు ఎంత గొప్పగా ఉందో మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో చోటుచేసుకున్న సంఘటన స్పష్టం చేస్తోంది. పెద్ద తరగతులకు వచ్చిన వస్తున్న తెలుగులో అక్షరాలు రాయలేని, సొంత పేరు రాసుకోలేని విద్యార్థులను చూసి కలెక్టర్ ఆశ్చర్యానికి గురయ్యారు.
మిడ్జిల్ మండలం వల్లభరావుపల్లి ప్రాథమికోన్నత పాఠశాలకు సోమవారం ఉదయం తనిఖీ చేసేందుకు కలెక్టర్ రొనాల్డ్‌రాస్ వచ్చారు. పది గంటలకల్లా వచ్చిన ఆయన ముందు టీచర్ల హాజరుపట్టీ తనిఖీ చేశారు. హాజరు తీరుపై ఆయన అడిగిన ప్రశ్నలకు ఉపాధ్యాయులు సరైన సమాధానాలు చెప్పలేక నీళ్లు నములుతూ తప్పుడు సమాచారం ఇచ్చారు. దీంతో కలెక్టర్ మండిపడ్డారు. అక్కడి నుంచి తరగతి గదుల్లోకి వెళ్లిన కలెక్టర్ ఒకటవ తరగతి విద్యార్థులను కొన్ని అక్షరాలు చదవమని సూచించారు. వాటిని విద్యార్థులు చదవకపోవడంతో ఆశ్ఛర్యపోయారు. తెలుగులో ఏ అక్షరం తరువాత ఏ అక్షరం వస్తుందో అడిగారు. కానీ ఎవరూ సరైన సమాధానం చెప్పలేకపోయారు. రెండు, నాలుగవ తరగతి విద్యార్థుల వద్దకు వెళ్లి పాఠ్యపుస్తకాల్లోని గుణింతాలు, పాఠాలను చదవమని అడిగారు. ఒక్కరూ సరిగా చెప్పలేదు..చదవలేదు. అదేవిధంగా ఐదవ తరగతి విద్యార్థులను కూడా తెలుగును చదవమని సూచించారు. వారు కూడా ఆ ఆయా పాఠాలను చదవలేకపోయారు. ఇక ఏడవ తరగతికి వెళ్లి తమ పేర్లతో పాటు తల్లిదండ్రుల పేర్లు, కుటుంబ సభ్యుల పేర్లు బ్లాక్‌బోర్డుపై రాయాలని విద్యార్థులకు కలెక్టర్ సూచించారు. కొందరు తమ పేర్లు తప్పు రాస్తే మరికొందరు అసలే రాయలేకపోవడంతో కలెక్టర్ తెల్లబోయారు. ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు విద్యార్థులందరి పరిస్థితి ఇలా ఎందుకుందని ఆయన ప్రధానోపాధ్యాయుడిని ప్రశ్నించారు. ఇదెక్కడి చదువులని, అసలు పిల్లలకు చదువులు చెబుతున్నారా? లేదా? అని ఉపాధ్యాయులను దులిపిపారేశారు. తెలుగులోకూడా చదవలేక, రాయలేకపోతే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలకువేలు జీతాలు తీసుకుంటూ పిల్లలకు చదువు చెప్పకపోవడం ఏమిటని నిలదీశారు. మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారని కొందరు ఉపాధ్యాయులను కలెక్టర్ ప్రశ్నించారు. హైదరాబాద్, మహబూబ్‌నగర్, షాద్‌నగర్‌లలోని ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్నామని వారు సమాధానం చెప్పడంతో ఆయన మండిపడ్డారు. మీ పిల్లలు ఇక్కడ చదివితే ఆ బాధ తెలిసేదని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివేవారు పేదపిల్లలని, వారికి సరిగ్గా విద్య అందించాలని అన్నారు. ఈ విషయంలో విఫలమైనారంటూ ప్రధానోపాధ్యాయుడు భానుప్రకాష్‌తో పాటు టీచర్లు రాజలక్ష్మి, సతీష్‌కుమార్, శే్వత, ఇమాయిద్దిన్‌ఖాన్‌లను సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఆ మేరకు తాఖీదు ఇవ్వాలని ఎం ఇ ఓ పద్మను ఆదేశించారు. అనంతరం రాచాలపల్లి గ్రామంలో పర్యటించారు. ఇక్కడ కొందరు వృద్ధులు తమకు పింఛన్లు రావడం లేదని మొరపెట్టుకోగా ఎందుకలా జరిగిందంటూ గ్రామ కార్యదర్శి లక్ష్మణ్‌నాయక్‌ను కలెక్టర్ ప్రశ్నించారు. సరైన సమాధానం చెప్పలేకపోవడంతో సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

చిత్రం..వల్లభరావుపల్లి ప్రాథమికోన్నత పాఠశాలను తనిఖీ చేస్తూ ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కలెక్టర్ రోనాల్డ్ రోస్