రాష్ట్రీయం

మే 12న టి.ఎమ్సెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 12: వృత్తి, సాంకేతిక విద్యా కోర్సులకు ప్రవేశపరీక్షల షెడ్యూలును తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. తెలంగాణలో ఇంజనీరింగ్ స్ట్రీం పరీక్ష మే 12న ఉదయం, మెడికల్ కోర్సులు, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ విభాగంలో చేరేందుకు మే 12వ తేదీ సాయంత్రం ప్రవేశ పరీక్షలు జరుగుతాయి. డిప్లొమో హోల్డర్లు, బిఎస్సీ గ్రాడ్యుయేట్లు ఇంజనీరింగ్‌లో నేరుగా రెండో సంవత్సరం చేరేందుకు ఉద్దేశించిన ఇసెట్ మే 6వ తేదీన, ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీల్లో బ్యాచిలర్స్ డిగ్రీలో చేరేందుకు నిర్వహించే పిఇసెట్ మే 16న, ఎంబిఎ, ఎంసిఎ కోర్సుల్లో చేరేందుకు ఐసెట్‌ను మే 18న, న్యాయవిద్యా కోర్సుల్లో చేరేందుకు లాసెట్ (యుజి) మే 27న లాసెట్ (పిజి) మే 27న, ఎడ్‌సెట్ మే 28న, ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, ప్లానింగ్ తదితర పిజి కోర్సుల్లో చేరేందుకు పిజిఇసెట్ మే 30న జరుగుతాయి.ఎమ్సెట్, ఇసెట్‌లను జెఎన్‌టియు హైదరాబాద్, పిఇ సెట్, ఎడ్‌సెట్, పిజి ఇసెట్‌లను ఉస్మానియా, ఐసెట్‌ను, లాసెట్, పిజి లాసెట్‌లను కాకతీయ యూనివర్శిటీలు నిర్వహిస్తాయి. కొన్ని ప్రవేశ పరీక్షలను ఈసారి ముందుకు జరిపారు. గత ఏడాది ఎమ్సెట్ మే 15న జరగ్గా ఈసారి 12వ తేదీనే నిర్వహించనున్నారు. ఇసెట్ మే 12న, ఐసెట్ మే 22న నిర్వహించారు. ఎడ్‌సెట్‌ను జూన్ 6న, పిజిఇసెట్‌ను జూన్ 4న నిర్వహించారు. ఈసారి పరీక్షలన్నీ నాలుగైదు రోజులు ముందుకు జరిపారు.
కన్వీనర్లు వారే
ఈసారి ఎమ్సెట్ కన్వీనర్‌గా డాక్టర్ ఎన్ యాదయ్య కొనసాగనున్నారు. సెట్ చైర్మన్‌గా జెఎన్‌టియు హెచ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎ వేణుగోపాల్‌రెడ్డి వ్యవహరిస్తారు. ఎమ్సెట్ కమిటీలో ప్రొఫెసర్ ఎ గోవర్ధన్, జి వి నర్సింహారెడ్డి, జి ప్రవీణ్ బాబులు యథాతథంగా కొనసాగనున్నట్టు తెలిసింది. అలాగే ఇసెట్‌కు ప్రొఫెసర్ ఎన్ యాదయ్య కన్వీనర్‌గానూ, కో కన్వీనర్లుగా డాక్టర్ ఎస్ తారాకల్యాణి, డాక్టర్ జివి నర్సింహారెడ్డి కొనసాగుతారు. ఎడ్‌సెట్‌కు చైర్మన్‌గా ప్రొఫెసర్ రామచంద్రం కొనసాగుతారు. అయితే కన్వీనర్‌గా ప్రొఫెసర్ పడాల ప్రసాద్ స్థానంలో వేరొకరిని నియమించే వీలుందని తెలిసింది. ఐసెట్, పిజి లాసెట్‌లకు చైర్మన్‌గా ప్రొఫెసర్ ఆర్ సాయన్న , కన్వీనర్‌గా ప్రొఫెసర్ ఎంవి రంగారావు కొనసాగుతారు. పిఇసెట్‌కు, పిజి ఇసెట్‌కు చైర్మన్‌గా ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం వ్యవహరిస్తారు. ఈసారి కన్వీనర్లు మారే అవకాశం ఉందని తెలిసింది.
ఫిబ్రవరి 23న ఎమ్సెట్ నోటిఫికేషన్
ఎమ్సెట్ నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 23న జారీ చేయనున్నట్టు తెలిసింది. దరఖాస్తుల సమర్పణకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా మార్చి 25 వరకూ, అపరాధ రుసుంతో ఏప్రిల్ 26 వరకూ గడువు ఇవ్వనున్నారు. ఏప్రిల్ 21 నుండి హాల్‌టిక్కెట్లు జారీ చేసి, మే 12న పరీక్ష నిర్వహిస్తారు. మే 18నే ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉందని తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో ఎమ్సెట్ కమిటీ సమావేశమై తుది షెడ్యూలును రూపొందించనుంది.