తెలంగాణ

శ్రీశైలం, సాగర్‌లలో తగ్గుతున్న నీటి మట్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 15: రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచినీటి కోసం కృష్ణా జలాలపై ఆధారపడిన 35కుపైగా పట్టణాలు రానున్న వేసవిలో తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొనే అవకాశం కనపడుతోంది. వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకుని ముందస్తు మంచినీటి వినియోగ ప్రణాళికకు ఈ నెలాఖరులో ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ శాఖాధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిబ్రవరి మొదటి వారంలో మంచినీటి అవసరాలపై కలెక్టర్లు, పురపాలక సంఘాలు, పంచాయితీ శాఖ, ఇరిగేషన్ అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో ప్రస్తుతం డెడ్‌స్టోరేజి పైన 64 టిఎంసి నీరు మాత్రమే అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం శ్రీశైలంలో 100.47 టిఎంసి, నాగార్జునసాగర్‌లో 140.85 టిఎంసి నీరు ఉంది. రబీ సీజన్‌కు నీటి విడుదలపోను 64 టిఎంసి నీరు ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్‌కు ఐదు టిఎంసి నీటిని నాగార్జునసాగర్ నుంచి సరఫరా చేయాల్సి ఉండగా, కృష్ణా బోర్డు 4 టిఎంసి నీటిని కేటాయించింది. జనవరి నెలకు ఆంధ్రాకు 35 టిఎంసి, తెలంగాణలో 19 టిఎంసి నీటిని కృష్ణా బోర్డు కేటాయించింది. కాని తెలంగాణ రాష్ట్రం మాత్రం నీటి కేటాయింపులపై అభ్యంతరం వ్యక్తం చేసింది. లభ్యతలో ఉన్న నీటిలో 70 శాతం ఆంధ్రాకు, 30 శాతం తెలంగాణకు బోర్డు కేటాయించింది.
రబీ సీజన్ కింద పంటలతో పాటు కృష్ణా జలాలపై ఆధారపడి రెండు రాష్ట్రాల్లో 35 పట్టణాల్లో రక్షిత మంచినీటి పథకాలు నిర్మించారు. నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాల్వల ద్వారా దాదాపు రెండు రాష్ట్రాల్లో 1.90 కోట్ల జనాభా తాగునీటి అవసరాలకు మంచి నీరు సరఫరా అవుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే వేసవిలో నీటి ఎద్దడి తీవ్రమయ్యే పరిస్ధితి ఉందని ఇరిగేషన్ ఇంజనీర్లు చెప్పారు. ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్ నుంచి సగటున రోజుకు 0.5 టిఎంసి లోపలే నీరు నాగార్జునసాగర్‌కు విడదలవుతోంది. నాగార్జునసాగర్ డ్యాంకు ఉన్న ప్రాధాన్యత ఉన్న దృష్ట్యా కిందికి నీటిని విడుదల చేసే పరిస్థితిలేదు.