రాష్ట్రీయం

విద్యుత్ మోత తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 18: ఆంధ్రాలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.859 కోట్ల విద్యుత్ చార్జీలను పెంచేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఏపి డిస్కంలు బుధవారం ఏపి విద్యుత్ నియంత్రణ మండలికి ప్రతిపాదనలు సమర్పించాయి. ఈ ప్రతిపాదనలపై వచ్చే రెండు నెలల్లో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రాంతాల్లో మండలి బహిరంగ విచారణ నిర్వహిస్తుంది. ఆ తరువాత మార్చి 31 లోపల పెంపుదలపై నిర్ణయం ప్రకటిస్తాయి. ఈలోగానే లోటును ఏ మేరకు భరిస్తామో మండలికి ప్రభుత్వం రాతపూర్వకంగా తెలపాల్సి ఉంటుంది. పెంచిన చార్జీలు వచ్చే ఏప్రిల్ 1నుంచి అమలులోకి వస్తాయి. 2017-18 సంవత్సరానికి రూ. 30,069 కోట్ల వార్షిక రెవెన్యూ అవసరమని డిస్కంలు పేర్కొన్నాయి. ప్రస్తుతం వసూలు చేస్తున్న టారిఫ్, నాన్ టారిఫ్ వల్ల రూ. 22,892 కోట్ల ఆదాయం వస్తోంది. 2015-16 చివరి త్రైమాసికంలో తలెత్తిన లోటు (ట్రూ అప్) రూ.887 కోట్లను రెవెన్యూ లోటుకు కలిపారు. దీని వల్ల వచ్చే ఏడాది రూ.8064 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడింది. ఈ లోటును పూడ్చేందుకు రాష్ట్రప్రభుత్వం రూ. 6937 కోట్లను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు డిస్కంలు తెలిపాయి. ఇంకా మిగిలిన లోటు రూ.859 కోట్లు ఉంటుంది. దీన్ని భర్తీ చేయాలంటే ఆ మేరకు చార్జీలు పెంచక తప్పదని డిస్కంలు ప్రతిపాదనల్లో స్పష్టం చేశాయి. ఒక యూనిట్ విద్యుత్ సరఫరా, వచ్చే రెవెన్యూ మధ్య తేడా రూ. 1.59 పైసలు ఉంది. వచ్చే ఏడాది మొత్తం 67,948 ఎంయు విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. 57,018 ఎంయు విద్యుత్ అవసరమవుతుంది. కాగా 10,930 ఎంయు మిగులు విద్యుత్ ఉంటుంది.
రాష్ట్రంలో మొత్తం 1.59 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఇందులో విద్యుత్ చార్జీలను పెంచడం వల్ల 67 శాతం మంది వినియోగదారులపై ఎటువంటి ప్రభావం ఉండదు. గృహ విద్యుత్ రంగంలో 1.28 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఇందులో 70 శాతం మంది అంటే 89.62 లక్షల మందిపై ఎటువంటి చార్జీల భారం పడబోదు. గ్రూప్ ఏ, గ్రూప్ బి కేటగిరీ వినియోగదారుల్లో వంద యూనిట్ల వరకు ఎటువంటి చార్జీలను పెంచాలని ప్రతిపాదించలేదు. గృహ రంగంలో విద్యుత్ చార్జీలను పెంచడం వల్ల 37.77 లక్షల మందిపై ప్రభావం పడుతుంది. దాదాపు రూ.150 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. దాదాపు 2.90 శాతం మేర చార్జీలుపెంచాలని ప్రతిపాదించారు. నెలకు వంద యూనిట్ల కంటే ఎక్కువ వినియోగం చేసే వారిపై ఒక శాతం చార్జీల భారం పడుతుంది. అంటే యూనిట్‌కు 11పైసల వరకు చార్జీలను పెంచుతారు. ఎల్‌టి కమర్షియల్‌లో 11.78 లక్షల మంది వినియోగదారుల ద్వారా రూ. 96కోట్లు, ఎల్‌టి ఇండస్ట్రియల్‌లో ఉన్న 1.06 లక్షల వినియోగదారుల ద్వారా రూ. 58కోట్లు, హెచ్‌టి ఇండస్ట్రియల్ వినియోగదారులు 5409 మంది ద్వారా రూ. 357 కోట్లు, హెచ్‌టి కమర్షియల్ (ఇతరులు) 218 వినియోగదారుల ద్వారా రూ. 51 కోట్లు, ఇతర కేటగిరీల ద్వారా 1.47 లక్షల మంది వినియోగదారుల నుంచి రూ. 147కోట్ల టారిఫ్ ఆదాయాన్ని సమకూర్చుకుంటామని, దీనికి అనుమతి ఇవ్వాలని డిస్కంలు ప్రతిపాదించాయి. ఇతరచార్జీల ద్వారా రెవెన్యూ రూ. 268 కోట్లు వస్తుంది.