రాష్ట్రీయం

ఏపీ అదరహో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 23: రాష్ట్రంలో పెట్టుబడుల కోసం తీసుకుంటున్న చర్యల వల్ల ప్రపంచంలో రాష్ట్రానికి ఒక గుర్తింపు లభించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలతపై విశ్వాసాన్ని పెంపొందించగలిగామన్నారు. దావోస్ పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న సందర్భంగా పర్యటన విశేషాలను వెలగపూడి సచివాలయంలో సోమవారం ఆయన విలేఖరులకు వివరించారు. దావోస్ సదస్సులలో 150 దేశాలకు చెందిన 3000 మంది ప్రతినిధులు పాల్గొన్నారని, ఇంటర్నెట్ ఫర్ ఆల్‌లో భాగంగా చేపట్టిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు ప్రపంచానికే మోడల్‌గా మారిందన్నారు. మన జల సంరక్షణ చర్యలు కూడా గుర్తింపు పొందాయన్నారు. చెట్టు నుంచి విద్యుత్, నీరుపై
పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. విమానం కన్నా వేగంగా వెళ్లే వాహనాలను రూపొందించే దిశగా ‘హైపర్ రూమ్’ పేరిట పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. శూన్యత కలిగిన ట్యూబ్‌లో ప్రయాణం ద్వారా ఇది సాధ్యం చేసేలా పరిశోధనలు సాగుతున్నాయన్నారు. ప్రపంచంలోనే నగదు రహిత లావాదేవీలు జరుగుతున్న రాష్ట్రంగా నవ్యాంధ్రకు గుర్తింపు లభించిందని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో రిఫైనరీ ఏర్పాటుపై త్వరలో మరింతగా చర్చలు జరపనున్నట్లు తెలిపారు. సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ మేనేజ్‌మెంట్‌పై మైక్రోసాఫ్ట్ ప్రతినిధి సత్య నాదెళ్లతో చర్చించానన్నారు. వైద్యం, విద్యుత్ రంగాల్లో పరిస్థితి మరింత మెరుగుకు కొన్ని సంస్థలు ముందుకొచ్చాయన్నారు. వైద్య పరికరాల తయారీ, మైనింగ్‌కు కూడా కొన్ని సంస్థలు ముందుకొచ్చాయన్నారు.