రాష్ట్రీయం

భగీరథ ముగిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 24: ‘మిషన్ భగీరథ పథకాన్ని ఎట్టిపరిస్థితుల్లో డిసెంబర్ నెలాఖరకు పూర్తి చేసి ఇంటింటికి మంచినీళ్లు అందించాలి. ఇది దేశానికి ఆదర్శం. స్వయంగా ప్రధాని ప్రారంభించారు. ఏడు రాష్ట్రాలు ఇక్కడికొచ్చి అధ్యయనం చేసి వెళ్లాయి. నీతి ఆయోగ్ కూడా ప్రశంసించింది. ఇది పూర్తి కావడానికి ఈ 11 నెలలే అత్యంత కీలకం. ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాకరమైన పథకాన్ని చిత్తశుద్ధితో లక్ష్యం మేరకు గడువులోగా పూర్తి చేయాలి. దీనికి నిధులు కొరత లేదు. వివిధ ఆర్థిక సంస్థలు రూ.30 వేల కోట్లు రుణాన్ని మంజురు చేశాయి’ అని సిఎం కెసిఆర్ అన్నారు. ప్రగతి భవన్‌లో మంగళవారం మిషన్ భగీరథ పథకంపై ఉదయం నుంచి సాయంత్రం వరకు సంబంధిత అధికారులతో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి రోడ్ మ్యాప్ ప్రకటించారు. వచ్చే ఎన్నికల నాటికి అన్ని గ్రామాలకు మంచినీటిని అందించకుంటే ఓట్లు అడగమని ప్రకటించాం. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి రేయంబవళ్లు పనులు శరవేగంగా జరగాలని సిఎం ఆదేశించారు. ఈ పథకాన్ని డిసెంబర్ 2017 కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ జూన్ లోగానే పనులు పూర్తి చేయాలన్నారు. వర్షాకాలంలో పనులు అనుకున్నంత వేగంగా జరగవు. ఆ లోగానే శరవేగంగా పనులు పూర్తి కావాలన్నారు. ఈ మార్చి నాటికి 8,547 కి.మీ పైపు లైన్లు పూర్తి అవుతాయి. వాటి నుంచి 3,811 గ్రామాలకు 9,79,245 ఇళ్లకు నీరందించాలన్నారు. అలాగే డిసెంబర్ నాటికి 42,780 కి.మీ పైపులైను పూర్తి చేసి 20,366 గ్రామాల్లోని 42.38 లక్షల ఇళ్లకు నీరు అందించాలని రోడ్ మ్యాప్ ప్రకటించారు. మరోవైపు ఇంటింటికి ఇంటర్‌నెట్ సౌకర్యాన్ని కల్పించేందుకు డిసెంబర్ చివరికల్లా 42వేల 618 కి.మీ మేర ఆఫ్టికల్ పైబర్ కేబుల్ లైను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వర్కింగ్ ఏజెన్సీలు ప్రభుత్వ ఉద్దేశ్యాలను అర్థం చేసుకొని సకాలంలో పనులు పూర్తి చేస్తే ఒక శాతం ఇనె్సంటివ్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన రాయితీని ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం బాగుంది, వృద్ధిరేటు అధికంగా ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ ఉండటంతో దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మిషన్ భగీరథ పథకంలో విద్యుత్ సరఫరా అత్యంత ముఖ్యమైంది, సబ్ స్టేషన్ల నిర్మాణం, విద్యుత్ లైన్ల నిర్మాణ పనులు వేగంగా జరగాలన్నారు. పైపులైన్ల నిర్మాణంలో వివిథ శాఖలతో సమన్వయం చేసుకోవడం కూడా ముఖ్యమే అన్నారు. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, పంచాయతీరాజ్ రహదారులు, రైల్వే క్రాసింగ్‌లు, కెనాల్ క్రాసింగ్‌లు, రివర్ క్రాసింగ్‌ల విషయంలో ఆ శాఖలతో ఎప్పటికప్పుడు సమావేశమై అవసరమైన అనుమతులు పొందాలని ఆదేశించారు. అలాగే అటవీశాఖ అనుమతులు పొందడానికి కలెక్టర్లు చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పైపులైన్లు 148 చోట్ల నదులు దాటాల్సి ఉండగా ఇప్పటికే 53 చోట్ల పనులు జరగాయని, 1477 చోట్ల కెనాల్స్ దాటాల్సి ఉండగా ఇప్పటికే 164 చోట్ల పనులు పూర్తి అయ్యాయని, 237 చోట్ల రైల్వే క్రాసింగ్‌లు ఉండగా 207 చోట్లకు అనుమతులు లభించగా, 44 చోట్ల పనులు పూర్తి అయ్యాయని వివరించారు. జాతీయ రహదారులపై 442 చోట్ల, 4447 చోట్ల ఆర్ అండ్ బి రహదారులను క్రాస్ చేయాల్సి ఉండగా 590 చోట్ల పనులు పూర్తి అయ్యాయన్నారు. క్రాసింగ్‌లకు అనుమతులు లభించని మిగిలిన చోట్ల సాధించడానికి సంబంధిత శాఖల అధికారులతో వెంటనే సమావేశం కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు.