రాష్ట్రీయం

ఏపి అంటే మాకు ఇష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 27: ఆంధ్రప్రదేశ్ అంటే కేంద్రానికి ప్రత్యేకమైన అభిమానం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. రెండు రోజులపాటు విశాఖలో జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ప్రారంభోత్సవ సభలో మంత్రి జైట్లీ మాట్లాడుతూ ఏపితో కేంద్రానికి ప్రత్యేక అనుబంధం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని అన్నారు. రాష్ట్ర విభజన వలన ఏపి చాలా ఒడిదుడుకులను ఎదుర్కోవలసి వస్తోందన్న విషయాన్ని కేంద్రం గుర్తించిందని చెప్పారు. ఎన్ని సమస్యలున్నప్పటికీ డబుల్ డిజిట్ గ్రోత్ సాధించి ఏపి దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని జైట్లీ ప్రశంసించారు. భారత ప్రభుత్వం గత రెండేళ్లలో చేపట్టిన సంస్కరణలు దేశ ముఖ చిత్రానే్న మార్చేశాయని అన్నారు. సంస్కరణలకు ప్రజల మద్దతు కూడా లభించిందని ఆయన చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో భారత ప్రభుత్వం ధైర్యంగా సంస్కరణలను ప్రవేశపెట్టిందని జైట్లీ చెప్పారు. పారిశ్రామికరంగానికి పెద్దపీట వేసి, పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ వేశామని వివరించారు. జన్‌ధన్ ఖాతాలు, జిఎస్‌టి, పెద్ద నోట్ల రద్దు వంటి సాహసోపేత నిర్ణయాలు దేశ పురోభివృద్ధికి మార్గాన్ని సుగమం చేస్తున్నాయన్నారు. ఏపిలో మానుఫ్యాక్చరింగ్, అగ్రికల్చర్ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి మంచి అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ఏపికి అదనంగా ఏంకావాలన్నా ఇస్తామని జైట్లీ హామీ ఇచ్చారు.

చిత్రం..జ్యోతి ప్రజ్వలన చేస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ