రాష్ట్రీయం

నల్లధనానికి నోట్ల రద్దు పరిష్కారం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 28: దేశంలోని నల్లధనం విదేశాలకు తరలిపోయిందని, పెద్ద నోట్ల రద్దు నల్లధనం నిర్మూలనకు పరిష్కారం కాదని కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ జర్నలిస్టు అరుణ్ శౌరీ అన్నారు. నిజంగా నల్లధనం పెద్ద మొత్తంలో ఉన్నవారు భారతీయ కరెన్సీలో ఎలా తమ వద్ద ఉంచుకుంటారని ఆయన ప్రశ్నించారు. శనివారం ఇక్కడ హైదరాబాద్ సాహిత్య ఉత్సవంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, నల్లధనం అనే డెంగ్యూకారక దోమ స్విట్జర్లాండ్‌లో ఉంటే, ఇక్కడ ఆ దోమను సంహరించేందుకు చర్యలు తీసుకుంటే ప్రయోజనం ఏమిటన్నారు. ప్రజలకు పెద్దనోట్లరద్దు వల్ల నల్లధనం పట్టుకున్నారా లేదా అనే విషయమై ఏమీ తెలియదన్నారు. ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నంత మాత్రాన, ఆ ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు ప్రజల ఆమోదం ఉందని భావించరాదన్నారు. పెద్ద నోట్ల రద్దువల్ల దేశానికి ఏ మేరకు ప్రయోజనం కలిగిందో ఎవరికీ తెలియదన్నారు.

చిత్రం..హైదరాబాద్ జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న అరుణ్‌శౌరీ