రాష్ట్రీయం

మాయా వినోదం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 29: ఇటీవలి కాలంలో వందల కోట్ల రూపాయల బడ్జెట్‌తో పోటాపోటీగా భారీ కమర్షియల్ చిత్రాలు విడుదలవుతున్నాయి. భారీగా లాభాలు వస్తుండటంతో మళ్లీ మళ్లీ అలాంటి చిత్రాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. అయితే వినోదపన్ను వసూళ్ల విధానంలో ఉన్న లొసుగులు స్థానిక సంస్థల పాలిట శాపంగా మారాయి. అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బాలకృష్ణ నటించిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రానికి నిర్మాత అడిగిందే తడవుగా రాష్ట్ర ప్రభుత్వం వినోదపన్ను మినహాయింపునిస్తూ ఈ నెల 9న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆదరాబాదరాగా ఉత్తర్వులు జారీ కావటంతో కొన్ని పొరబాట్లు దొర్లాయి. 1939 ఎపి వినోదపన్ను చట్టం ప్రకారం 75 శాతం రాయితీ ఇస్తున్నందున ప్రేక్షకుల నుంచి వసూలు చేసే సాధారణ టిక్కెట్ చార్జీలో 75 శాతం మించి వసూలు చేయరాదని స్పష్టంగా పేర్కొన్నారు. అంటే రూ.100ల టిక్కెట్‌కు రూ.75లు మాత్రమే వసూలు చేయాల్సి ఉంది. అయితే డిస్ట్రిబ్యూటర్లు మాత్రం టిక్కెట్ రేట్లు పెంచడం అటుంచి సాధారణ టిక్కెట్ చార్జీలో నయాపైసా కూడా తగ్గించలేదు. పైగా ఆ మేర వినోదపన్ను మినహాయింపు సొమ్ము కూడా నేరుగా వారికే చేరింది. అయితే జీవోలోని లొసుగులను సవరిస్తూ ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ సినిమాకు పూర్తి మినహాయింపు కూడా ఇచ్చేశారు. గతంలో సినిమా థియేటర్లలో శ్లాబ్ రేటు అమల్లో ఉండేది. సీట్లు ఖాళీగా ఉన్నప్పటికీ నిర్ణీత శ్లాబ్ రేటు చెల్లించాల్సి రావటంతో నష్టాలతో అనేక థియేటర్లు మూతబడ్డాయి. కొందరు యజమానులైతే తమ థియేటర్లు నిత్యం కళకళలాడుతూ ఉండాలని అప్పోసప్పో చేసి డిస్ట్రిబ్యూటర్లకు ముందుగా ఎదురు పెట్టుబడి పెట్టేవారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో శ్లాబ్ రేటు ఎత్తివేయడంతో థియేటర్ల యజమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2వేల థియేటర్లు వున్నాయి. ఒక్క విజయవాడ నగరం, పరిసరాల్లో దాదాపు 60కి పైగా థియేటర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న నిబంధనల మేరకు ఎన్ని టిక్కెట్లు తెగితే వాటికే వినోదపన్ను చెల్లించాల్సి ఉంది. ఏసి థియేటర్లలో హైబడ్జెట్ చిత్రాలకు 15 శాతం, లోబడ్జెట్ చిత్రాలకు 7 శాతం, డబ్బింగ్, హిందీ, ఇంగ్లీష్ సినిమాలకు 20 శాతం, నాన్ ఏసి థియేటర్లలో 13 శాతం, 7 శాతం, 18 శాతం చొప్పున వినోదపన్ను చెల్లించాల్సి ఉంది. థియేటర్ యజమాని ప్రతి ఆటకు ఏ తరగతిలో ఎన్ని టిక్కెట్లు కట్ చేసిందీ నమోదు చేసుకుని వారానికోసారి వీక్లీ రిపోర్ట్‌లతో వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయానికి వెళ్లి అందజేయాల్సి ఉంది. వాస్తవానికి విజయవాడ నగరం మొత్తంలో కేవలం ఇద్దరు ఉద్యోగులనే దీనికి కేటాయించటంతో నెలకోసారైనా వెళ్లి ఆకస్మిక తనిఖీలు చేసే అవకాశం లేదు. దీంతో కొందరు డబ్బింగ్ లేదా ఇంగ్లీషు చిత్రాలను ప్రదర్శించి కూడా లోబడ్జెట్ చిత్రాలను ప్రదర్శిస్తున్నట్లు తమ రిపోర్టుల్లో చూపుతున్నారు. తాజాగా కొన్ని థియేటర్లలో శాతకర్ణి చిత్రాన్ని రెండు ఆటలుగా, ‘ఖైదీ నెం.150’ సినిమాను రెండు ఆటలుగా చూపి మొత్తం నాలుగు ఆటలను శాతకర్ణి ప్రదర్శించినట్లు చూపారనే ప్రచారం జరుగుతోంది. ఇక కొందరు తరచూ ప్రతి ఆటకు కూడా తమ హాల్ పూర్తిగా నిండలేదనే సమాచారాన్ని పంపుతున్నారని తెలుస్తోంది. ఇలా ఎన్ని మోసాలు జరుగుతున్నప్పటికీ రాష్టవ్య్రాప్తంగా సాలీనా దాదాపు రూ.300 కోట్ల వరకు వినోదపన్ను వసూలవుతున్నట్లు సమాచారం. ఇందులో స్థానిక సంస్థలకు అధికంగా 90 శాతం, సినిమాటోగ్రఫీ సంస్థకు 75 శాతం పోగా ప్రభుత్వానికి మిగిలేది కేవలం మూడు శాతం మాత్రమే. దీంతో వినోదపన్ను వసూళ్లపై ప్రభుత్వానికి శ్రద్ధ లేకుండాపోతోంది. స్థానిక సంస్థలకే పర్యవేక్షించే అధికారం ఉంటే కొంతమేర న్యాయం జరుగుతుందని పలువురు సూచిస్తున్నారు.