రాష్ట్రీయం

మరింత ముందుకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 31: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో కీలక ఘట్టానికి బుధవారం అంకురార్పణ జరుగుతోంది. ప్రపంచంలోని మరే ప్రాజెక్టులోనూ చేపట్టని విధంగా డయాఫ్రమ్ వాల్ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. దీంతోపాటు దేశంలోనే ఎతె్తైన విధంగా 16 మీటర్ల వెడల్పు, 20 మీటర్ల పొడవున్న అతిపెద్ద 48 క్రస్ట్‌గేట్ల నిర్మాణ పనులు కూడా మొదలుకానున్నాయి. ఈ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నారు. గత నెలాఖారులో చేపట్టిన స్పిల్ వే పనులతో ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు పనులు జోరందుకున్నాయి. ఇప్పుడు డయాఫ్రమ్ వాల్, క్రస్ట్‌గేట్ల నిర్మాణానికీ ప్రభుత్వం శ్రీకారం చుడుతుండటంతో పనులు మరింత వేగం పుంజుకోనున్నాయి. ప్రాజెక్టు నిర్మాణంలో డయాఫ్రమ్ వాల్‌తో కూడిన ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ కీలకమైనది. నదీ ప్రవాహానికి అడ్డంగా 1,740 మీటర్ల పొడవు కలిగిన ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ అడుగు భాగం 300 మీటర్ల వెడల్పు ఉంటుంది. డ్యామ్ పైభాగానికి వచ్చేసరికి 15 మీటర్ల వెడల్పు ఉండేలా నిర్మిస్తున్నారు. రాక్‌ఫిల్ డ్యామ్‌ను డయాఫ్రమ్ వాల్‌తో కలిపి నిర్మాణం చేపడుతున్నారు. నది అడుగు భాగంలోని ఇసుక పొరల నుంచి ప్రవహించే నీటికి అడ్డుకట్ట వేసి డ్యామ్‌కు ఎలాంటి నష్టమూ వాటిల్లకుండా ఉండేందుకు డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని చేపడుతున్నారు. డయాఫ్రమ్ వాల్‌ను ఇసుక పొరల మీదుగా రాతిపొరల వరకూ నిర్మిస్తారు. నది అడుగు భాగాన ఉన్న రాయి తగిలిన తరువాత మరో 2 మీటర్ల వరకూ రాతిపొరలను తవ్వి డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తారు. అక్కడి నుంచి నదీతలం (రివర్ బెడ్) వరకూ దీని నిర్మాణం జరుగుతుంది. ఒకటిన్నర మీటర్ల వెడల్పుతో పనులు చేపట్టిన ప్రాంతంలో రాయి తగిలేదాన్నిబట్టి 40 నుంచి 100 మీటర్ల లోతు వరకూ దీన్ని నిర్మిస్తారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో 1.20 లక్షల క్యూబిక్ మీటర్ల ప్లాస్టిక్ కాంక్రీట్‌ను వినియోగించనున్నారు. ఇలాంటి భారీ నిర్మాణం ఇప్పటివరకూ ప్రపంచంలో మరే ఇతర ప్రాజెక్టు నిర్మాణాల్లోనూ చేపట్టకపోవడం గమనార్హం. డయాఫ్రమ్ వాల్‌కు మధ్యస్థంగా నదీతలం పైనుంచి ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి భారీ యంత్రాలు సిద్ధం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగం పంచుకుంటున్న బావర్ కంపెనీ ఈ యంత్రాలను సమకూర్చింది. బావర్ ఎంసి 128 కట్టర్, ఎంసి 96 గ్రాబర్, ఎంసి 40 కట్టర్‌తో పాటు చిజిలర్స్ యంత్రాలను డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో వినియోగించనున్నారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ముందు నదీగర్భంలోకి 1.5 మీటర్ల మందంతో ప్యానెల్‌ను దింపుతారు. ఆ ప్యానెల్ దింపే సమయంలో పక్కనున్న ఇసుక ఖాళీల్లోకి పడిపోకుండా ఉండేలా బెంటోనైట్ (జిగురుమట్టి ద్రావణం)తో నింపుతారు. తరువాత కాంక్రీట్ వేస్తారు. ఈ సమయంలో జిగురుమట్టి ద్రావణం బయటకు వచ్చేస్తుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 1,740 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల వెడల్పు, 40 నుంచి 100 మీటర్ల లోతు వరకూ నిర్మించే డయాఫ్రమ్ వాల్ ప్రపంచలోనే అతిపెద్దది. దీని నిర్మాణంలోనూ ప్లాస్టిక్ కాంక్రీటును వినియోగిస్తారు. సిమెంట్‌తో బెంటనైట్‌ను కలుపుతారు. ప్లాస్టిక్ కాంక్రీట్ కోసం రెండు తయారీ యూనిట్లను ఏర్పాటు చేశారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో ముఖ్యమైనది స్పిల్‌వేలో ఏర్పాటు చేయబోయే క్రస్ట్‌గేట్ల నిర్మాణం. 16 మీటర్ల వెడల్పు, 20 మీటర్ల ఎత్తుతో 48 భారీ గేట్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ గేట్లు హైడ్రాలజీ విధానంతో కూడిన రిమోట్ కంట్రోల్‌తో పనిచేస్తుంటాయి. ఈ గేట్లు దేశంలో ఉన్న అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టుల గేట్ల కంటే పెద్దవి కావడం విశేషం. క్రస్ట్‌గేట్ల తయారీకి 18 వేల మెట్రిక్ టన్నుల స్టీల్‌ను వినియోగిస్తున్నారు. వాటితోపాటు 10 రివర్ స్లూయిస్‌ల నిర్మాణం చేపట్టనున్నారు.

చిత్రం..ప్రాజెక్టు పనుల నిమిత్తం ఆ ప్రాంతానికి చేరుకున్న భారీ యంత్రాలు