రాష్ట్రీయం

క్రిష్, నితిన్ తండ్రి ఇళ్లల్లో ఐటి సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 31: సినీ పరిశ్రమకు చెందిన పలువురు డిస్ట్రిబ్యూటర్ల కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు మంగళవారం సాయంత్రం దాడులు నిర్వహించారు.
ముగ్గురు సినీ డిస్ట్రిబ్యూటర్ల కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నట్టు తెలిసింది. ఐటి అధికారులు పలు సినిమాలకు చెందిన దస్త్రాలను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నట్టు ఓ సీనియర్ ఐటి అధికారి తెలిపారు. సినీ దర్శకుడు క్రిష్, నిర్మాత రాజీవ్‌రెడ్డి, సినీ హీరో నితిన్ తండ్రి సుధాకర్‌రెడ్డి ఇళ్లలో ఐటి శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ప్రముఖ నటుడు బాలకృష్ణ నటించిన వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఇటీవల విడుదలై సంగతి తెలిసిందే. కాగా తెలంగాణ ప్రభుత్వం ఈ చిత్రాన్ని పన్ను నుంచి మినహాయింపుకూడా ఇచ్చింది. ఈ చిత్రం విజయం సాధించడంతో దానిపై వచ్చిన ఆదాయానికి సంబంధించిన లెక్కల కోసమే హైదరాబాద్‌లోని పంపిణీదార్ల కార్యాలయాలల్లో సోదాలు నిర్వహించినట్టు తెలుస్తోంది. ఇదిలావుండగా శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై హీరో నితిన్ తండ్రి సుధాకర్‌రెడ్డి పలు చిత్రాలను నిర్మించారు. తాజాగా గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాన్ని తెలంగాణలో సుధాకర్‌రెడ్డి పంపిణీ చేశారు. హైదరాబాద్‌లోని సుధాకర్‌రీరెడ్డి కార్యాలయంలో కూడా ఐటి అధికారులు సోదాలు జరిపారు.