రాష్ట్రీయం

ప్రముఖ చిత్రకారుడు, నాటకకర్త అబ్బూరి గోపాలకృష్ణ కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (కల్చరల్), జనవరి 31: విశాఖ నగర సాహితి, సాంస్కృతిక, విద్యా రంగాల్లో తనదైన విశిష్ట ముద్ర వేసిన అబ్బూరి గోపాలకృష్ణ (80) మంగళవారం ఎంవిపి కాలనీలోని ఆయన నివాసంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అస్వస్థులుగా ఉన్నారు. అబ్బూరి మార్చి 2, 1937లో విశాఖలో జన్మించారు. 13వ ఏటనే ఆయన విజయనగరంలో చిత్రలేఖనంలో ప్రఖ్యాతులైన అంట్యాకుల పైడిరాజు వద్ద నాలుగేళ్లు విద్య అభ్యసించారు. ఎయులో 1997లో థియేటర్ ఆఫ్ ఆర్ట్స్ విభాగాధిపతిగా పదవీ విరమణ చేశారు. విలక్షణ వ్యక్తిత్వంతో లలిత కళా అకాడమి, ఎపి నృత్య అకాడమి, భారత కళాపరిషత్‌కు వ్యవస్థాపక సభ్యుడిగా వ్యవహరించారు. అఖిల భారత హస్తకళల సంస్థకు డిజైనర్‌గా, ఎయు బోర్డు ఆఫ్ స్టడీస్ అధ్యక్షుడిగా ఆయన పని తీరు ఆదర్శనీయమైంది. విశాఖ మ్యూజియం, ఆకాశవాణి కేంద్ర స్థాపనలో ఆయన తన ఉనికిని చాటుకున్నారు. మృచ్ఛకటికం, కన్యాశుల్కం, వీరభోజ్య వసుంధర వంటి నాటకాలకు కాస్ట్యూమ్ డిజైన్ చేశారు. తాళ్లపాక అన్నమాచార్యుని యక్షగాన సంప్రదాయ రీతులపై పరిశోధన వ్యాసం సమర్పించారు. 36 మంది రీసెర్చి స్కాలర్లకు మార్గదర్శనం చేశారు. ఆయన లయ, ఇంటర్వ్యూ, స్వాతంత్య్రం వంటి 9 నాటకాలు రాశారు. వీటిలో ‘తిజకి యమదర్శనం’ నాటకం కన్నడ భాషలో సుమారు వంద ప్రదర్శనలకు నోచుకుంది.