తెలంగాణ

విడిపోయాక అభివృద్ధి పథంలో తెలంగాణ, ఆంధ్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 5:విడిపోతే ఏదో జరిగిపోతుందని కొందరు గగ్గోలు పెట్టారని కానీ ఇప్పుడు విడిపోయి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో ముందుకు పోతున్నాయని ఐటి శాఖ కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. మాజీ మంత్రి విజయరామారావు టిఆర్‌ఎస్‌లో చేరడంతో ఆ నియోజక వర్గానికి చెందిన పలువురు టిడిపి నాయకులు తెలంగాణ భవన్‌లో మంగళవారం ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి కెటిఆర్ మాట్లాడారు. ఇప్పుడు రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకు పోతున్నాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను చూసి ఇతర పార్టీల నాయకులు టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారని అన్నారు. ఇతర పార్టీల నాయకులు టిఆర్‌ఎస్‌లో చేరుతున్న కార్యక్రమాలతో తెలంగాణ భవన్‌లో ప్రతి రోజూ పండుగ వాతావరణం కనిపిస్తోందని అన్నారు. గత పాలకులు పవర్ హాలిడే ప్రకటించారని, టిఆర్‌ఎస్ ప్రభుత్వం కోతలు లేకుండా 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయగలుగుతున్నట్టు చెప్పారు. తెలంగాణ వస్తే గుజరాతీలు, మరాఠాలు, కర్నాటక వారిని వెళ్లగొడతారని విష ప్రచారం చేశారని, కానీ 18 నెలల కాలంలో ఏ ఒక్క అవాంచనీయ సంఘటన జరగలేదని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ఇప్పుడు అన్ని వర్గాలు కలిసి బంగారు తెలంగాణ కోసం పని చేస్తున్నారని అన్నారు.
డబుల్ బెడ్‌రూమ్ అద్భుత పథకం
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అద్భుతంగా ఉన్నాయని మాజీ మంత్రి విజయరామారావు తెలిపారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకం చాలా మంచి పథకమని, దేశంలో ఎవరికీ ఇలాంటి ఆలోచన రాలేదని అన్నారు. విశ్వనగరం అంటే ఎత్తయిన భవనాలు నిర్మించడం కాదని అందరూ సుఖ సంతోషాలతో నివసించడానికి అనువైన వాతావరణం అని అన్నారు. విశ్వనగరంగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందని అన్నారు.
మనసున్న ప్రభుత్వం
టిఆర్‌ఎస్ ప్రభుత్వం మనసున్న ప్రభుత్వం అని ఎంపి బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. పేదల కోసం టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో విపక్షాలకు అభ్యర్థులు దొరకని పరిస్థితి ఏర్పడిందని, ఏం మాట్లాడాలో తెలియని ఆయోమయంలో పడిపోయారని అన్నారు. టిఎస్‌ఐపాస్‌ను చూసి గూగుల్, అమెజాన్ లాంటి ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నారని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌లో గులాబీ జెండా రెపరెపలాడడం ఖాయమని అన్నారు. విశ్వనగరంగా హైదరాబాద్ అభివృద్ధిని కోరుకునే వారందరూ టిఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నారని అన్నారు.