రాష్ట్రీయం

అభివృద్ధే టార్గెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 2: నిర్దేశిత లక్ష్యాలను సాధించే దిశగా బడ్జెట్‌ను రూపొందించాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. బడ్జెట్ రూపకల్పనలో ఒక దృక్పథం ఉండాలన్నారు. గురువారం వెలగపూడి సచివాలయంలో బడ్జెట్ రూపకల్పనపై కసరత్తు, ఈనెల 6న కార్యదర్శులు, హెచ్‌ఓడిలపై జరిగే సమావేశ అజెండాపై చర్చించేందుకు ఆర్థిక, ప్రణాళికా శాఖాధికారులతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు. జివిఏ, ఎస్‌డిజి, కుటుంబ వికాసం, సామాజిక వికాసం, కీ పెర్‌ఫార్మెన్స్ ఇండికేటర్స్ (కేపిఐ) అనే ఐదు ఫలితాల ఆధారితంగా బడ్జెట్‌కు రూపకల్పన చేయాలని ఆదేశించారు. సుస్థిర అభివృద్ధి కోసం 15 శాతం వృద్ధిరేటు రావటానికి కృషి చేయాలని దిశా నిర్దేశం చేశారు. ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన నిధులనే ప్రభుత్వం అభివృద్ధికి ఖర్చు చేస్తోందని, కేటాయింపులు ప్రాధాన్యతాక్రమంలో ఉండాలని ముఖ్యమంత్రి చెప్పారు. వౌలిక సదుపాయ రంగాలైన జాతీయ రహదారులు, రైల్వేలు, ఓడరేవులు, పోర్టులు, అంతర్గత జల రవాణా అంశాల్లో ఎక్కువగా కేంద్ర నిధులను రాబట్టి ఉపయోగించుకోవటం ద్వారా బడ్జెట్ నిధులను ప్రాధాన్యతల ప్రకారం వినియోగించుకోవచ్చని అన్నారు. ఆర్థిక, ప్రణాళిక శాఖలు కలసి సంయుక్తంగా సమ్మిళిత వృద్ధిపై చర్చించాలని కోరారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో 33 శాతంగా వున్న ఉద్యానవన శాఖ ఆదాయాన్ని 60 శాతానికి తీసుకెళ్లాలని సూచించారు. శాఖలను బలోపేతం చేయటానికి ఔట్ సోర్సింగ్ సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. ఎక్కువమందిని వ్యవసాయమే ఆదుకుంటోందని, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఆక్వా కల్చర్లకు ఎక్కువ నిధులు ఖర్చు చేస్తున్నామన్నారు. సమావేశంలో ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి టక్కర్, ఆర్థిక శాఖ ఉన్నత కార్యదర్శి అజేయ్ కల్లం, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..ఆర్థిక, ప్రణాళికశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు