ఆంధ్రప్రదేశ్‌

దండగమారి భద్రత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 4: రాష్ట్రంలోని ట్రెజరీ కార్యాలయాలకు భద్రత పేరిట కోట్లాది రూపాయలు వృథాగా ఖర్చు చేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. గతంలో ఒక్కో జిల్లా ట్రెజరీ కార్యాలయంలో కనీసం వంద కోట్ల రూపాయలకు తగ్గకుండా రిజిస్ట్రేషన్ స్టాంపులు నిలువ ఉండేవి. అలాగే వివిధ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలను కూడా ఇక్కడే భద్రపరిచేవారు. దీంతో ప్రతి జిల్లా ట్రెజరీ కార్యాలయానికి నిత్యం మూడు షిఫ్ట్‌ల్లో... షిఫ్ట్‌కు ఇద్దరు చొప్పున ఆరుగురు సాయుధ పోలీసులను బందోబస్తులో నియమిస్తూ వచ్చారు. తెల్గీ కుంభకోణం తర్వాత ట్రెజరీల నుంచి స్టాంప్ పేపర్లను, ఆ తర్వాత ప్రశ్నపత్రాలను భద్రపరచడాన్ని నిలిపివేశారు. ఇక ఆన్‌లైన్ లావాదేవీలు వచ్చాక, ట్రెజరీల్లో నగదు నిల్వలు కూడా ఉండటం లేదు. అయినప్పటికీ కొనే్నళ్లుగా ఈ బందోబస్తు మాత్రం కొనసాగుతున్నది. ఒక్కో పోలీసుకు నెలకు రూ.50వేలు చొప్పున ఆరుగురికి కనీసం మూడు లక్షలు చొప్పున సాలీనా రూ.36 లక్షలు అనవసరంగా ఖర్చు చేస్తున్నారు. ఇలా మొత్తం 13 జిల్లాల్లో ఈ విధంగా సాలీనా ఐదుకోట్ల రూపాయలకు పైగా వృథా అవుతున్నట్టే.
ఇదిలాఉండగా ఏ పని ఎంత కాలంలో పూర్తికావాలో తెలియజేసే బోర్డులు ట్రెజరీ కార్యాలయాల్లో వెక్కిరిస్తూ కన్పిస్తున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అధికారులు, ఉద్యోగులు తమ పదవీ విరమణ సమయంలో ముందుగానే పెన్షన్లు, ఇతరత్రా రావాల్సిన ప్రయోజనాల కోసం హైదరాబాద్‌లోని అకౌంటెంట్ జనరల్ కార్యాలయానికి బిల్లులు పంపించడం సాంప్రదాయంగా వస్తోంది. అక్కడ బిల్లులు ముందుగా కదలటమనేది సామాన్యమైన విషయం కాదు. ఆపై తొలిదశలో ఏజి కార్యాలయం నుంచి ముందుగా జిల్లా ట్రెజరీ కార్యాలయాలకు ఆ బిల్లులు చేరుకుంటాయి. అక్కడ చేతులు తడపందే సబ్ ట్రెజరీ కార్యాలయాలకు చేరవు. ఈ విధంగా నెలల తరబడి సంబంధిత ఉద్యోగులు కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ప్రతినెలా ఉద్యోగుల జీతాల బిల్లుల తయారీ సమయంలోనే జిపిఎఫ్ ఖాతాలకు నిర్ణీత సొమ్ము మళ్లుతూ ఉంటుంది. పలు సందర్భాల్లో మిస్సింగ్ క్రెడిట్స్ ఉంటున్నాయి. ఇలాంటి దోషాలను కేవలం ఐదు రోజుల్లో సరిదిద్దాల్సి ఉండగా.. ప్రస్తుతం నెలల తరబడి సమయం పడుతోంది. అలాగే ఉద్యోగులు, పెన్షనర్ల మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు నిన్నటివరకు డిఎంఇ కార్యాలయం, తాజాగా డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్ట్‌కు చేరుకోటానికి కూడా ఎన్నో రోజులు సమయం పడుతున్నది. అయనా ఉన్నతాధికారులు గాని, ఉద్యోగ సంఘాల నేతలు గాని నేటివరకు నోరు మెదపకపోవటమే ఆశ్చర్యం.

చిత్రం... ట్రెజరీ కార్యాలయం ముందు బందోబస్తులో ఉన్న పోలీసు