రాష్ట్రీయం

నాలెడ్జ్ హబ్‌గా ఏపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 5: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం అన్నివిధాలా సహకరిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆదివారం ఉదయం మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో ఇక్కడి ఆంధ్రా లయోలా కళాశాలలో జరిగిన రాష్టస్థ్రాయి మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయుల సదస్సులో ఆయన మాట్లాడారు. పూర్వ ఆంధ్రప్రదేశ్‌లో సాంకేతిక అంశాలకు ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చానని, దాంతో ఐటి రంగంలో ఎందరికో ఉద్యోగాలు వచ్చాయని అన్నారు. ప్రపంచంలో నలుగురు ఐటి నిపుణులు ఉంటే వారిలో ఒకరు భారతీయులని, ఈ నలుగురిలో ఒకరు ఆంధ్రప్రదేశ్‌కి చెందినవారు ఉంటున్నారన్నారు. గతంలో తాను ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో మహిళల్లో అక్షరాస్యత శాతం పెంచేందుకు కృషి చేశానని, జనాభా తగ్గించడానికి ఈ చర్య దోహదపడిందన్నారు. నేడు దానికి విరుద్ధంగా జనాభా పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని చంద్రబాబు చెప్పారు. మన దేశంలో విద్యా విధానం, అమెరికా విద్యావిధానానికి మధ్య వ్యత్యాసం ఉందన్నారు. మన దేశంలో క్లాస్‌రూం విద్యావిధానం కొనసాగుతోందని, అమెరికాలో 50 శాతం క్లాస్‌రూం, 50 శాతం ప్రాక్టికల్ విద్యావిధానం ఉంటాయన్నారు. దీనివల్ల విద్యార్థులు ఉద్యోగానికి కావలసిన తర్ఫీదు కూడా పొందినట్లు అవుతుందన్నారు. మన దేశంలోని విద్యార్థులకు కామన్‌సెన్స్ చాలా ఎక్కువని, అందువల్లే ప్రపంచం మొత్తంలో వీరు రాణించగలుగుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ని నాలెడ్జ్ హబ్‌గా చేయడానికి ఉపాధ్యాయులు తమ శక్తియుక్తులను ఉపయోగించాలని పిలుపిచ్చారు. ప్రతి సంవత్సరం మే నెలలోపు డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు.

చిత్రం..విజయవాడలో ఆదివారం జరిగిన ఎంఇవోలు, హెచ్‌ఎంల సదస్సులో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు