రాష్ట్రీయం

‘హోదా’పై ఐక్య ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, ఫిబ్రవరి 5: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై ఐక్యంగా ఉద్యమించాలని పలువురు వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ‘విభజన చట్టం-ప్రత్యేక తరగతి హోదా-ప్రత్యేక ప్యాకేజీ’ అనే అంశంపై ఆదివారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రధాన వక్త పాట్నా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పి.లక్ష్మణారెడ్డి మాట్లాడుతూ పారిశ్రామికంగా, ఆర్థికంగా అభివృద్ధిచెందిన హైదరాబాద్ నగరాన్ని ఇవ్వనందున ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను నాటి ప్రధాని రాజ్యసభలో ప్రకటించి క్యాబినెట్‌లో ఆమోదింపచేశారని పేర్కొన్నారు. పార్లమెంట్ ఇచ్చిన హామీల అమలుకు ఐక్యంగా ఉద్యమించాలన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ లాంటి వెనుకబడిన ప్రాంతాలపై ప్రత్యేక ప్రాధాన్యతను కల్పించకుండా అభివృద్ధి వికేంద్రీకరణ చేయకుండా, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రీకృత అభివృద్ధికి దోహదం చేస్తోందని తద్వారా సమగ్రాభివృద్ధికి విఘాతం కలుగుతుందని తెలిపారు. మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి రాష్ట్ర విభజన చట్టం అమలు, ప్రత్యేక తరగతి హోదాపై సమగ్ర చర్చ జరపాలని అన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చినట్టయితే లక్షలాది కోట్ల పెట్టుబడులు వచ్చి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెంది ఉండేదని, లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభించేవని పేర్కొన్నారు. ఏపి ముఖ్యమంత్రి స్వార్థ ప్రయోజనాలకోసం కేంద్ర ప్రభుత్వానికి దాసోహం అయ్యారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదాపై జరిగే ఉద్యమాలకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డాక్టర్ తులసిరెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీకి 24వేల కోట్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం 2,300 కోట్లు మాత్రమే ఇచ్చారని అన్నారు.
జన చైతన్య వేదిక అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రిటైర్డ్ ఐఎఎస్ అధికారి చంద్రవౌళి, లోక్‌సత్తా అధికార ప్రతినిధి కె.శ్రీనివాస్, ప్రముఖ విశే్లషకుడు కొమ్మినేని శ్రీనివాస్, రాజకీయ విశే్లషకుడు తెలకపల్లి రవి, ఐటి ఉద్యోగుల అసోసియేషన్ నేత పోతుల శివ, జన విజ్ఞాన వేదిక జాతీయ కమిటీ కార్యదర్శి టివి.రావు, హైకోర్టు న్యాయవాదులు రామకృష్ణ, శివప్రసాద్ పాల్గొన్నారు.

చిత్రం..సమావేశంలో పాల్గొన్న జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి, ఉండవల్లి అరుణ్‌కుమార్ తదితరులు