రాష్ట్రీయం

ఏప్రిల్ 5న శ్రీరామనవమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, ఫిబ్రవరి 5: దేశంలో శ్రీరామనవమి తేదీకి కొలమానం భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం వైదిక కమిటీదే. ఈసారి ఏప్రిల్ 5న శ్రీరామనవమి, శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహించాలని భద్రాచల దేవస్థానం వైదిక కమిటీ ఖరారు చేసింది. ఈ మేరకు ఆదివారం భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల తేదీలను ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం దేవస్థానంలో మార్చి 29న ఉగాది వేళ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 1న అంకురార్పణ, 2న ధ్వజపట భద్రక మండల చిత్రలేఖనం, 3న అగ్నిప్రతిష్ఠ, ధ్వజారోహణం, 4న ఎదుర్కోలు, 5న శ్రీరామనవమి, 6న మహాపట్ట్భాషేకం, 7న సదస్యం, 8న చోరోత్సవం, 9న ఊంజల్ సేవ, 10న వసంతోత్సవం, 11న చక్రతీర్థంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని స్థానాచార్యులు స్థలసాయి, ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు, పొడిచేటి సీతారామానుజాచార్యులుతో కూడిన వైదిక కమిటీ ప్రకటించిందని దేవస్థానం ఈవో తాళ్లూరి రమేశ్‌బాబు వెల్లడించారు.