రాష్ట్రీయం

శారదాపీఠంలో వనదుర్గ యాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 5: విశా ఖ శ్రీశారదాపీఠంలో శ్రీవనదుర్గ అమ్మవారి యాగం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. పీఠాధిపతి శ్రీస్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి అమ్మవారి యాగంలో పాల్గొన్నారు. దేశ ప్రజ ల హితం కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో శ్రీస్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. పాలకులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ, దేశంపై ఏలినాటి శని ప్రభావం పడకుండా ఉండేందుకు అన్ని గ్రహాలకు అధిదేవత వనదుర్గ మాతకు మహాకుంభాభిషేకం నిర్వహిస్తున్నట్టు స్వరూపానంద స్వామి తెలిపారు. భారత జాతి సర్వసుభిక్షంగా ఉండాలని, రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, ప్రజలు సుఖ శాంతులతో జీవించాలని, ప్రకృతిపరంగా ఎటువంటి విపత్కర పరిస్థితులు తలెత్తకుండా ఉండాలని కోరుతూ నవగ్రహ దేవత వనదుర్గకు హోమం చేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రభుత్వాధినేతలు మంచి పాలన అందిస్తున్నప్పటికీ భగవంతుని అనుగ్రహం కోసం ఇటువంటి వేద కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయన్నారు. మూడో రోజు కార్యక్రమం లో బ్యాడ్మింట న్ క్రీడాకారిణి పివి సింధు, కోచ్ గోపీచంద్ దంపతులు, బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్, హైకోర్టు న్యాయమూర్తులు సీతారామమూర్తి, దుర్గాప్రసాద్, రాజమండ్రి ఎంపి మురళీమోహన్ ప్రత్యేక పూజలు చేశారు.

చిత్రం..శారదాపీఠంలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు తదితరులు