రాష్ట్రీయం

8న కృష్ణా బోర్డు సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 5: ఒక వైపు తరుముకొస్తున్న వేసవి, మరో వైపు రబీ సీజన్ తుది దశకు చేరుకోవడంతో రెండు రాష్ట్రాల్లో నీటి విడుదలకు ప్రభుత్వంపై ఆయకట్టు రైతుల వత్తిడి. ఈ రెండు డిమాండ్‌ల మధ్య నీటివాటాల కేటాయింపుకోసం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కెఆర్‌ఎంబి) ఈ నెల 8వ తేదీన హైదరాబాద్ సమావేశం నిర్వహించనుంది. రెండు రాష్ట్రాల మధ్య రెండు నెలలుగా తమ వాటా నీరు తమకు వెంటనే కేటాయించాలని లేఖల యుద్ధం నడించింది. దీంతో కృష్ణా బోర్డు ఈ నెల 8వ తేదీ బుధవారం హైదరాబాద్ లో రెండు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ నిపుణులు, ఇం జనీర్ ఇన్ చీఫ్‌లతో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో తాడోపేడో తేల్చుకునే దిశగా తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తమకు తక్షణమే 16 టిఎంసిల నీటిని నాగార్జునసాగర్ నుంచి వదలాలని కృష్ణా బోర్డుకు తాజాగా లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే 25 టిఎంసిల నీటిని అధికంగా వాడుకుందని, ఆ మేరకు 25 టిఎంసి నీటిని విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం బోర్డును కోరింది. ‘ఈ సారి సమావేశం చాలా కీలకమైంది. తెలంగాణాకు అధికారికంగా ఖరారైన నిష్పత్తి మేరకు నీటి కేటాయింపులు జరపాలని బోర్డును కోరాం. దీనిపై పట్టుబట్టనున్నాం. మంచినీరు, రబీ సీజన్‌కు మా వాటా మాకు కేటాయించాలని బోర్డు కు నిర్మొహమాటంగా తెలియచేయనున్నాం ’ అని తెలంగాణ ఇరిగేషన్ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ తెలిపారు. కృష్ణా జలాల్లో తమ వాటా తమకు విడుదల చేయాలంటూ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు బోర్డుకు గత నెల రోజుల్లో మూడు సార్లు లేఖలు రాశాయి. ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తమకు 16 టిఎంసిల నీరు అత్యవసరంగా విడుదల చేయాలని బోర్డు ను కోరుతూ శనివారం లేఖ రాశారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పంటలకు 12 టిఎంసిల నీరు, మంచినీటికి 4టిఎంసిల నీరు కావాలని కోరారు. ఐదు టిఎంసిల నీటిని అదనంగా తెలంగాణ వాడుకుందని ఏపిఆరోపిస్తోంది. బచావత్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్‌కు 811 టిఎంసిలు కేటాయించింది. ఇందులో ఆంధ్ర వాటా 512 టిఎంసిలు తెలంగాణ వాటా 299 టిఎంసిలు. కృష్ణా బేసిన్‌లో నీటి లభ్యతను బట్టి నీటి వినియోగం ఉండాలనే సూత్రానికి కట్టుబడి ఉండాలని మొదటి నుంచి కృష్ణా బోర్డు నీటి నిపుణులు ఇరు రాష్ట్రాలకు సూచిస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 77.86 టిఎంసిలు, నాగార్జునసాగర్‌లో 140.49 టిఎంసిల నీరు ఉంది.