రాష్ట్రీయం

సికింద్రాబాద్, విజయవాడ స్టేషన్ల ఆధునీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 5: రైల్వే స్టేషన్ల మరింత అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా దేశ వ్యాప్తంగా తొలిదశ ఎంపిక చేసిన 23 రైల్వే స్టేషన్లలో సికింద్రాబాద్, విజయవాడ రైల్వే స్టేషన్లకు స్ధానం దక్కిందని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ప్రముఖ నగరాల రైల్వే స్టేషన్లను అత్యాధునిక సౌకరాలు, సాంకేతిక పరిజ్ఞానం, అన్ని హంగులతో తీర్చిదిద్దేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచన మేరకు స్విస్ చాలెంజ్ పద్దతిలో చేపట్టనుంది. సికింద్రాబాద్, విజయవాడ రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు. రైల్వేమంత్రి సురేష్ ప్రభు ఈ నెల 8న ఢిల్లీలో ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. దేశం లో ఉన్న 8 వేల రైల్వే స్టేషన్లలో రైల్వేకి వచ్చే రెవెన్యూను ఆధారం చేసుకుని, ప్రాధాన్యతా క్రమంలో 400 రైల్వే స్టేషన్ల స్టేషన్‌రీ డెవలెప్‌మెంట్ ప్రాజె క్టు కింద మరింత అభివృద్ధి చేసేందుకు రైల్వే నిర్ణయించిందని వెల్లడించింది. ప్రయాణికులకు సౌకర్యాలను విస్తృతం చేయడంతో పాటు వాణిజ్యపరమైన సేవలను మరింత విస్తత్రం చేసేందుకు హోటళ్లు, మల్టిప్లెక్స్‌లు, షాపింగ్ మాల్స్ వంటి వాటిని నిర్మించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రపం చ స్థాయి రైల్వే స్టేషన్లుగా ఆధునీకరించేందుకు కృషి జరుగుతోందని దక్షిణ మధ్య రైల్వే జిఎం కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.